క్రీడాభూమి

హాకీ ఇండియా లీగ్ పంజాబ్‌పై ఢిల్లీ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, జనవరి 20: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో జేపి పంజాబ్ వారియర్స్‌పై ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్టు 5-4 తేడాతో గెలిచింది. రూపీందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి వరకూ ఉత్కంఠ రేపిన ఈ పోరు ప్రేక్షకులను అలరించింది. మ్యాచ్ తొమ్మిదో నిమిషంలోనే యువరాజ్ వాల్మీకి గోల్ చేసి ఢిల్లీని ఆధిక్యంలో నిలబెట్టాడు. టోర్నమెంట్ కొత్త నిబంధనలను అనుసరించి మొదటి 10 నిమిషాల్లో లభించే గోల్‌ను రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. దీనితో ఢిల్లీ 2-0 ఆధిక్యా న్ని అందుకోగా, ఒక నిమిషం వ్యవధిలోనే మాథ్యూ గోడెస్ గోల్ చేశాడు. ఫలితంగా పంజాబ్ స్కోరును సమం చేయగలిగింది. కాగా, 24 నిమిషంలో రూపీందర్ గోల్ చేస్తే, మరో నాలుగు నిమిషాల వ్యవధిలో మార్క్ పియర్సన్ కూడా గోల్‌ను నమోదు చేశాడు. ఈ రెండు గోల్స్ కారణంగా ఢిల్లీ ఆధిక్యం 4-2కు చేరింది. ఈ దశలో పంజాబ్‌కు క్రిస్టోఫర్ సిరియెల్లో ఒక గోల్‌ను అందించి, ఢిల్లీ ఆధిక్యాన్ని 4-3కు తగ్గించాడు. 36వ నిమిషంలో రూపీందర్ తన రెండో గోల్‌ను చేయడంతో ఢిల్లీ మరోసారి పటిష్టమైన స్థితికి చేరింది. 54వ నిమిషంలో మార్క్ గ్లెగోర్న్ గోల్ సాధించడంతో ఢిల్లీ ఆధిక్యం తగ్గింది. అయతే, మరోసారి ఈక్వెలైజర్ ను పంజాబ్ ఆటగాళ్లు చేయలేక చేతులెత్తేశారు. ఢిల్లీ విజయాన్ని అందుకుంది.
శ్రీలంక క్యూరేటర్
వర్నవీరపై వేటు
దుబాయ్, జనవరి 20: శ్రీలంక క్యూరేటర్ జయానంద వర్నవీరపై వేటు పడింది. అవినీతి నిరోధక విభాగం (ఎసియు)కు విచారణకు సహకరించని కారణంగా అతనిని మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గాలే స్టేడియంలో క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్న వర్నవీరపై పలు ఆరోపణలున్నాయి. ముడుపులు స్వీకరించి, పిచ్‌ని బుకీలకు అనుకూలంగా మారుస్తున్నాడని అతనిపై పలువురు ధ్వజమెత్తారు. గత ఏడాది శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య గాలేలో టెస్టు జరిగినప్పుడు ఇవే ఆరోపణలపై అతనిని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) మ్యాచ్ నుంచి తప్పించింది. కాగా, అతనిపై వచ్చిన ఆరోపణలపై ఐసిసి ఆధ్వర్యంలోని ఎసియు విచారణ జరపుతుండగా, వర్నవీర తన వాదన వినిపించలేదు. విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నాడని ఐసిసి తన ప్రకటనలో తెలిపింది. ఎసియుకు సహకరించని అతనిని మూడేళ్లు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.