క్రీడాభూమి

వెస్లీతో ఆనంద్ రాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 15: అమెరికాకు చెందిన వెస్లీ సోతో లండన్ చెస్ క్లాసిక్ నాలుగో రౌండ్ గేమ్ ఆడిన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రాజీకి అంగీకరించాడు. గేమ్ మొదటి నుంచి ఇరువరు ఆటగాళ్లు దూకుడును ప్రదర్శించకుండా, పావులను అతి జాగ్రత్తగా ముందుకు నడిపించారు. దీనితో ఫలితం తేలదని స్పష్టమైంది. చివరికి ఇద్దరూ గేమ్‌ను డ్రాగా ముగించడానికి అంగీకరించారు. ఇలావుంటే, మూడో రౌండ్‌లో ఆనంద్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్న మైఖేల్ ఆడమ్స్ నాలుగో రౌండ్‌లో వెసెలిన్ తపలోవ్‌ను ఓడించాడు. లెవాన్ అరోనియన్, అనీష్ గిరి మధ్య జరిగిన గేమ్ డ్రా అయింది. అదే విధంగా, హికారూ నాకమూర/ వ్లాదిమీర్ క్రామ్నిక్, మాక్సిమ్ వచియెర్ లాగ్రేవ్/ ఫాబియానో కరువానా మధ్య గేమ్స్ కూడా ఎలాంటి ఫలితాలు తేలకుండానే ముగిశాయి.