క్రీడాభూమి

పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో ధోనీ కెప్టెన్సీయే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 17: పరితమ ఓవర్ల ఫార్మాట్స్‌లో భారత్‌కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా కొనసాగించడమే మేలని, అతని అపారమైన అనుభవం యువ ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి, ఐదో టెస్టు మ్యాచ్‌కి ఒక చానెల్ తరఫున ఎక్స్‌పర్ట్ కామెంటేటర్‌గా వచ్చిన కపిల్ పిటిఐతో మాట్లాడుతూ టెస్టు జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీకే పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని వవస్తున్న డిమాండ్‌పై వ్యతిరేకంగా స్పందించాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. అంతమాత్రం చేత ధోనీని తొలగించాలన్న డిమాండ్ సరైంది కాదని అన్నాడు. ధోనీని సమర్థుడైన కెప్టెన్‌గా అభివర్ణించాడు. వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో భారత్‌కు అతని సేవల అవసరం ఎంతైనా ఉందని చెప్పాడు.