క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 20: ఆస్ట్రేలియా గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ డిఫెండింగ్ చాంపియన్లు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తమతమ విభాగాల్లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న నొవాక్ జొకోవిచ్, సెరెనా విలియమ్స్ ముందంజ వేశారు. వీరిద్దరూ తమ రెండో రౌండ్ మ్యాచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెల్చుకున్నారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో జొకోవిచ్‌కు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా పోటీకి అర్హత సంపాదించిన క్వెంటిన్ హాలిస్ ఎదురుపడ్డాడు. చివరి సెట్‌లో తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ, జొకోవిచ్ తన అపారమైన అనుభవం ఉపయోగపడగా సులభంగానే రెండో రౌండ్‌ను పూర్తి చేశాడు. ఈ రౌండ్‌ను 6-1, 6-2, 7-6 తేడాతో సొంతం చేసుకున్న జొకోవిచ్ తన టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా రెండో అడుగు వేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న రోజర్ ఫెదరర్ కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. అతను అలెక్సాండర్ డొల్గొపొలొవ్‌ను 6-3, 7-5, 6-1 తేడాతో ఓడించి, కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకునే అవకాశాలను మెరుగుపరచుకున్నాడు. ఏడోసీడ్ కెయ్ నిషికోరి 6-3, 7-6, 6-3 తేడాతో ఆస్టిన్ క్రజిసెక్‌ను, తొమ్మిదో సీడ్ జో విల్‌ఫ్రైడ్ సొంగా 7-5, 6-1, 6-4 ఆధిక్యంతో ఒమర్ జల్కాను ఓడించారు. థామస్ బెర్డిచ్ 6-4, 6-0, 6-3 స్కోరుతో మీర్జా బాసిక్‌పై విజయం సాధించాడు. నిక్ కిర్గియోస్ 6-4, 7-5, 7-6 తేడాతో పాబ్లో క్యుయెవాస్‌పై గెలిచాడు.
రెండో రౌండ్‌కు భూపతి
లక్సెంబర్గ్ ఆటగాడు గిలెస్ ముల్లర్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో ఆడుతున్న భారత ఆటగాడు మహేష్ భూపతి రెండో రౌండ్ చేరాడు. మొదటి రౌండ్‌లో భూపతి, ముల్లర్ జోడీ 7-6, 3-6, 6-4 తేడాతో అలెక్స్ బోల్ట్, ఆండ్రూ విటింగ్టన్ జోడీని ఓడించింది. కాగా, మరో భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ పోరాటం మొదటి రౌండ్‌తోనే ముగిసింది. ఫ్రాన్స్‌కు చెందిన జెరెమీ చారడీతో కలిసి ఆడిన అతను జువాన్ సెబాస్టియన్ కబాల్, రాబర్ట్ ఫరా జోడీ చేతిలో 3-6, 4-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

సూపర్ ఫామ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణమే తన ప్రత్యర్థి షీ సూ వెయ్‌పై విరుచుకుపడిన ఆమె 6-1, 6-2 స్కోరుతో సులభంగా గెలిచింది. ఇటీవల కాలి గాయంతో బాధపడుతూ పలు టోర్నీలకు దూరమైన ఆమె పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని ఈ మ్యాచ్ ద్వారా నిరూపించింది. కాగా, రష్యాకు చెందిన టెన్నిస్ బ్యూటీ, ఐదోసీడ్ మరియా షరపోవా కూడా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. అలక్సాండ్రా శాస్నోవిచ్‌ను ఢీకొన్న ఆమె 6-2, 6-1 తేడాతో విజయభేరి మోగించింది. 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకున్న ఆమె మరోసారి ఆ టైటిల్‌ను అందుకునేందుకు తీవ్రంగా పోటీపడుతున్నది. నాలుగోసీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా 6-4, 6-2 స్కోరుతో యూగెనీ బుచార్డ్‌పై విజయం సాధించగా, 12వ సీడ్ బెలిండా బెన్సిక్ 6-3, 6-3 తేడాతో టిమియా బబోస్‌ను ఓడించింది. పదో సీడ్ కార్లా సౌరెజ్ నవరో 6-7, 6-2, 6-2 ఆధిక్యంతో క్వాలిఫయర్ మరియా సకారీపై గెలిచి మూడో రౌండ్ చేరింది. కటెరినా బొండెరెన్కో 6-1, 7-5 తేడాతో స్వెత్లానా కుజ్నెత్సొవాను, రాబర్టా విన్సీ 6-2, 6-3 తేడాతో ఇరినా ఫాల్కొనీని ఓడించారు. కాగా, ఏడో సీడ్ పెట్రా క్విటోవాకు రెండో రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఈ టోర్నీలో అత్యుత్తమంగా 2012లో సెమీ ఫైనల్ వరకూ చేరిన ఆమె 4-6, 4-6 తేడాతో డారియా గావ్రిలొవా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది.