క్రీడాభూమి

పవార్ మనస్తాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 17: ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) అధ్యక్ష పదవికి మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ రాజీనామా చేశాడు. ఏడు పదుల వయసు దాటిన వారు ఇంకా క్రికెట్ సమాఖ్యలు, సంఘాల్లో కీలక పాత్ర పోషించడం, వర్కింగ్ కమిటీల్లో కొనసాగడం పట్ల వస్తున్న విమర్శలకు మనస్తాపం చెందిన కారణంగానే అతను రాజీనామా చేసినట్టు సమాచారం. గతంలో బిసిసిఐ, ఐసిసిలకు అధ్యక్షుడిగా సేవలు అందించిన పవార్ ఇప్పుడు ఎంసిఎ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బిసిసిఐ, దాని అనుబంధ సంఘాల పాలక మండలిలో 70 ఏళ్లకు పైబడిన వారు ఉండకూడదని లోధా కమిటీ చేసిన సిఫార్సును సుప్రీం కోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఏడు పదుల వయసు దాటినప్పటికీ, చాలా మంది బిసిసిఐతోపాటు వివిధ క్రికెట్ సంఘాల్లో పదవులను పట్టుకొని వేళాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోవడం లేదని పలువురు ధ్వజమెత్తుతున్నారు. ఈ విమర్శలతో మనస్తాపం చెందిన పవార్ ఎంసిఎ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నాడు. లోధా కమిటీ చేసిన సిఫార్సుల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.

చిత్రం..ఎంసిఎ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పవార్