క్రీడాభూమి

రొకూజోతో పెళ్లికి మెస్సీ ఏర్పాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనస్ ఎయిర్స్, డిసెంబర్ 24: తన చిరకాల స్నేహితురాలు, చాలాకాలంగా తాను సహజీవనం చేస్తున్న ఆంటోనెల్లా రొకూజోను పెళ్లి చేసుకోవడానికి అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మెస్సీ ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, వచ్చే ఏడాది వేసవిలో వీరి వివాహం జరుగుతుందని, అందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని అర్జెంటీనా మీడియా వార్తా కథనాలను ప్రచురించింది. సినిమా కథను పోలిన మెస్సీ జీవితంలోకి రొకూజో చాలా చిన్నతనంలోనే ప్రవేశించింది. ఇద్దరూ పదేళ్లలోపు పిల్లలుగా ఉన్నప్పుడే స్నేహితులు. కాలంతోపాటు వారి స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. సుమారు దశాబ్దకాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు థియాగో, మటేవో ఉన్నారు. పెళ్లి కాకుండానే భార్యాభర్తలుగా చెలామణి అయిన మెస్సీ, రొకూజో ఇప్పుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడం విచిత్రం.

చిత్రం..ఆంటోనెల్లా రొకూజో, మెస్సీ