క్రీడాభూమి

రంజీ క్వార్టర్ ఫైనల్‌లో కర్నాటక చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 24: జాతీయ జట్టులో టెస్టు ఓపెనర్‌గా ప్రధాన భూమిక పోషిస్తున్న లోకేష్ రాహుల్, ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఏకంగా ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టిన కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లు ఉన్న కర్నాటక జట్టు ఇక్కడ జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో చిత్తయింది. నాలుగు రోజుల ఈ మ్యాచ్‌ని కేవలం రెండు రోజుల్లోనే ముగించిన తమిళనాడు సెమీస్‌కు దూసుకెళ్లింది. లో స్కోరింగ్‌తో కొనసాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 88 పరుగులకే కుప్పకూలింది. రవి కుమార్ సమర్థ్ (11), మనీష్ పాండే (28), కరుణ్ నాయర్ (14), కెప్టెన్ వినయ్ కుమార్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. తమిళనాడు బౌలర్లలో అశ్విన్ క్రైస్ట్ 31 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టాడు. నటరాజన్‌కు రెండు వికెట్లు లభించాయి.
అనంతరం తమిళనాడు మొదటి ఇన్నింగ్స్‌లో 152 పరుగులు చేసింది. విజయ్ శంకర్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, దినేష్ కార్తీక్ 31 పరుగులు సాధించాడు. శ్రీనాథ్ అరవింద్ 16 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. వినయ్ కుమార్, శ్రేయాస్ గోపాల్ చెరి రెండు వికెట్లు తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులు వెనుకబడిన కర్నాటక రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ ఒంటరి పోరాటం జరిపి 77 పరుగులు చేశాడు. రెండో అత్యుత్తమ స్కోరు కౌనైన్ అబ్బాస్ చేసిన 15 పరుగులు. ఈ వ్యత్యాసమే మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఏ విధంగా కొనసాగిందో స్పష్టం చేస్తుంది.
కాగితంపై ఎంతో పటిష్టంగా కనిపించే కర్నాటకను ఓడించి సెమీస్ చేరుకోవడానికి కేవలం 87 పరుగులు సాధించాల్సి ఉండగా, తమిళనాడు ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేరుకుంది. ఇంద్రజిత్ బాబా 16, దినేష్ కార్తీక్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తమిళనాడుకు సునాయాస విజయాన్ని అందించారు.

చిత్రం..రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమైన కర్నాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్
రెండో ఇన్నింగ్స్‌లో పోరాడిన కర్నాటక టాప్ స్కోరర్ లోకేష్ రాహుల్