క్రీడాభూమి

మీరు దేశానికి గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: భారత క్రికెట్ జట్టు, జూనియర్ హాకీ జట్లు ఇటీవల సాధించిన అద్వితీయ విజయాలను చూసి యావత్ దేశం గర్విస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’లో ఆయన క్రీడా రంగాన్ని కూడా ప్రస్తావించారు. గత పదిహేను రోజుల కాలంలో ఈ రెండు జట్లూ చిరస్మరణీయ విజయాలను సాధించాయని అన్నారు. ఇంగ్లాండ్‌ను టీమిండియా 4-0 తేడాతో ఓడించిందని, జూనియర్ హాకీ జట్టు ఏకంగా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుందని మోదీ గుర్తుచేశారు. చెన్నై టెస్టులో యువ క్రికెటర్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో రాణించాడని, లోకేష్ రాహుల్ 199 పరుగులు సాధించాడని అన్నాడు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటింగ్ నైపుణ్యంతో రాణించాడని, జట్టుకు అతను స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందిస్తున్నాడని కొనియాడారారు. 2016 సంవత్సరానికి రవిచంద్రన్ అశ్విన్‌ను అత్యుత్తమ క్రికెటర్‌గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 15 సంవత్సరాల తర్వాత జూనియర్ హాకీలో భారత్ ఒక శుభవార్త విన్నదని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ కప్‌ను సాధించిన యువ ఆటగాళ్లు ఒక అద్భుతాన్ని సాధించారని చెప్పారు. వారందరికీ పేరుపేరున శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. భారత హాకీ భవిష్యత్తుకు ఇది శుభసూచకమని అన్నారు. గత నెల భారత హాకీ మహిళల జట్టు ఆసియా చాంపియన్‌షిప్‌ను గెల్చుకుందని, రెండు రోజుల క్రితం అండర్-18 ఆసియా కప్‌లో కాంస్య పతకాన్ని సాధించిందని మోదీ తెలిపారు. వీళ్లందరికీ హృదపూర్వక శుభాకాంక్షలు తెలుపుకొంటున్నానని అన్నారు.