క్రీడాభూమి

సైనా పిబిఎల్‌లో ఆడితే నష్టమేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 26: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో సైనా నెహ్వాల్ ఆడినంత మాత్రాన నష్టమేమీ జరగదని ఆమె కోచ్ విమల్ కుమార్ స్పష్టం చేశాడు. మోకాలి గాయానికి ఇంగ్లాండ్‌లో శస్త్ర చేయించుకున్న సైనా ఇటీవలే మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమె గతంలో మాదిరి రాణించలేకపోతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పిబిఎల్‌లో ఆడడం వల్ల గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంటుందని కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆమె వ్యక్తిగత కోచ్ విమల్ ఆ వాదనను తోసిపుచ్చాడు. అంతర్జాతీయ ఈవెంట్స్ మాదిరిగా పిబిఎల్ కఠినమైన టోర్నీ కాదని అన్నాడు. పిబిఎల్‌లో విపరీతంగా శ్రమించాల్సిన అవసరం ఉండదన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ టోర్నమెంట్ మాదిరిగా నెలల తరబడి ఆడాల్సిన అవసరం కూడా లేదన్నాడు. వచ్చే ఏడాది మొత్తం 16 అంతర్జాతీయ ఈవెంట్స్ జరుగుతాయని, వాటిలో పాల్గొనేందుకు పిబిఎల్ ఒక శిక్షణా వేదికగా సైనాకు ఉపయోగపడుతుందని విమల్ అన్నాడు. పిబిఎల్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ సీజన్ మొదలయ్యేందుకు మూడు నెలల వ్యవధి ఉంటుందని చెప్పాడు. సైనా లాంటి సీనియర్ క్రీడాకారిణులు వివిధ సిరీస్‌లకు సిద్ధమయ్యేందుకు ఈ సమయం చాలని పేర్కొన్నాడు.

చిత్రం..సైనాతో విమల్ కుమార్