క్రీడాభూమి

పాక్, ఆసీస్ టెస్టుకు వర్షం బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 26: పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సోమవారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటను వర్షం వెంటాడింది. మొత్తం 50.5 ఓవర్ల ఆట సాధ్యంకాగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నాలుగు వికెట్లకు 142 పరుగులు చేసింది. ఓపెనర్ అజర్ అలీ 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, పాక్‌కు భారీ స్కోరును అందించే దిశగా సాగుతున్నాడు. మొదటి టెస్టులో చివరి వరకూ పోరాడినప్పటికీ ఓటమిపాలైన పాక్ ఈ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని, 18 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను సమీ అస్లం (9) రూపంలో కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన అజర్ అలీ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతుండగా, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ ఆజమ్ (23) కొంత సేపు పోరాడి, జొస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. సీనియర్ ఆటగాడు యూనిస్ ఖాన్ (21), కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (11) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. వర్షం కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి అజర్ (138 బంతుల్లో, 4 ఫోర్లతో 66 పరుగులు), అసద్ షఫీక్ (12 బంతుల్లో 4 పరుగులు) నాటౌట్‌గా ఉన్నారు.

చిత్రం..అజర్ అలీ
(66 నాటౌట్)