క్రీడాభూమి

అసూయ పడుతూనే ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: గాయాల కారణంగా కెరీర్‌లో ఎక్కువ శాతం విశ్రాంతికే పరిమితమవుతున్న భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తనకు కుటుంబం పట్ల ఉన్న గౌరవాన్ని, ప్రేమను, బాధ్యతను చాటుకున్నాడు. ‘మీరు అసూయ పడుతూనే ఉండండి..’ అంటూ విమర్శలకు చెంపపెట్టు సమాధానమిచ్చాడు. ఇటీవల తన భార్య హసీన్ జహాన్, కుమార్తె అయిరా షమీతో కలిసి తీయించుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో ఉంచడంతో వివాదం మొదలైంది. ఆ ఫొటోలో హసీన్ చేతుల్లేని డ్రెస్ వేసుకుందంటూ ట్విటర్‌లో చాలా మంది విమర్శించారు. ఆ విధంగా దుస్తులు ధరించడం ఇస్లామిక్ మతవిశ్వాసాలకు విరుద్ధమని ధ్వజమెత్తారు. హసీన్ ఆ విధంగా దుస్తులు ధరించినా అభ్యంతరం పెట్టకపోవడమేగాక, ఫొటోను ఫేస్‌బుక్‌లో, ట్విటర్‌లో పెట్టడం ఏమిటని నిలదీశారు. అయితే, ఇస్లామిక్ మతాన్ని అడ్డం పెట్టుకొని కొంత మంది చేసిన విమర్శలకు షమీ దీటుగానే స్పందించాడు. ‘హర్ కిసీకో జిందగీమే ముకామ్ నహీ మిల్తా.. కుచ్ కిస్మత్ వాలే హీ హోతేహై జినే ఏ నసీబ్ హోతాహై. జల్తే రహో...’ (అందరూ జీవితంలో లక్ష్యాలను చేరుకోలేరు. కొంత మంది అదృష్టవంతులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అసూయ పడుతునే ఉండండి..) అంటూ ట్వీట్ చేశాడు. ‘ఏ దోనూ మేరీ జిందిగీ హై. మై అచ్ఛా తర్హా జాన్తాహూ కీ క్యా కర్‌నా ఔర్ క్యా నహీ. హమే అప్నే అందర్ దేఖ్‌నా చాహియే కీ హమ్ కిత్నా అచ్ఛేహై..’ (వీరిద్దరే నా జీవితం. ఏది మంచో, ఏదో చెడో నాకు బాగా తెలుసు. మనం ఎంత మంచివాళ్లమో తెలుసుకోవడానికి మనలోకి మనం తొంగి చూసుకోవాలి) అంటూ చురకలు అంటించాడు.

వివాదానికి కారణమైన ఫొటో ఇదే