క్రీడాభూమి

పాకిస్తాన్ క్రికెట్ అకాడెమీలో పంజాబీ పేసర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 26: పాకిస్తాన్ జాతీయ క్రికెట్ అకాడెమీలో అకాడెమీలో చోటు దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ మహీందర్‌పాల్ సింగ్ కొత్త శకానికి నాంది పలికాడు. పాక్ అకాడెమీకి ఎంపికైన తొలి పంజాబీ క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు. 21 ఏళ్ల మహిపాల్ పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావీన్స్‌లోని గిరిజన ప్రాంతానికి చెందిన వాడు. అయితే, అతను లాహోర్ శివార్లలోని నాన్కానా సాహెబ్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే క్రికెట్‌లో ఓనమాలు దిద్దుకున్నాడు. జాతీయ అకాడెమీకి ఎంపికయ్యాడు. ఇప్పటి వరకూ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడలేదని, తన తొలి లక్ష్యం ఆ స్థాయిలో ఆడడమేనని మహిపాల్ అంటున్నాడు. పాక్ జాతీయ జట్టులో స్థానం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్తున్న అతను తన గమ్యాన్ని చేరుకుంటాడో లేదో చూడాలి.

చిత్రం..పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్‌తో మహిపాల్ సింగ్