క్రీడాభూమి

అతనే ఓ సైన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత క్రికెట్‌కు పర్యాయపదంగా మారిపోయాడు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రతి యుద్ధంలోనూ తానే ఒక సైన్యమై దూసుకెళ్లాడు. సహచరులకు మార్గదర్శకంగా నిలిచాడు. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన అతి కొద్దిమంది క్రికెటర్లలలో కోహ్లీ ముందు వరుసలో నిలిచాడు. టెస్టుల్లోనేగాక, అన్ని ఫార్మెట్స్‌లోనూ అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. ఐసిసి టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో భారత్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యం సులభసాధ్యంగానే కనిపించినా, భారత బ్యాటింగ్ అందుకు భిన్నంగా కొనసాగింది. ఒక దశలో 23 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వనే్డ లేదా టి-20 ఫార్మాట్స్‌లో అప్పటి వరకూ జరిగిన ఏ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఈవెంట్స్‌లోనూ పాక్ చేతిలో భారత్‌కు ఓటమి ఎదురుకాలేదు. మొదటిసారి అలాంటి ప్రమాదం ఎదురవుతుందోమోనన్న ఆందోళన అభిమానుల్లో తలెత్తింది. ఆ పరిస్థితుల్లో జట్టును ఆదుకునే బాధ్యతను యువరాజ్ సింగ్‌తో కలిసి కోహ్లీ తన భుజాలపై వేసుకున్నాడు. 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, పాకిస్తాన్‌పై ఐసిసి ప్రపంచకప్ టోర్నీల్లో టీమిండియాకు 11వ విజయాన్ని అందించాడు.నఒ
ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనూ కోహ్లీ తనదైన శైలిలో రాణించాడు. ఆసీస్ 160 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా బరిలోకి దిగిన భారత్‌కు యువరాజ్ సింగ్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి అండగా నిలిచాడు. అజేయంగా 82 పరుగులు సాధించి, భారత్‌ను గెలిపించాడు.
వెస్టిండీస్ టూర్‌కు వెళ్లినప్పుడు, ఆంటిగువాలో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి, అన్ని ఫార్మాట్స్‌లోనూ రాణించే సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడు. 283 బంతులు ఎదుర్కొన్న అతను 24 ఫోర్లతో 200 పరుగులు చేసి, షానన్ గాబ్రియల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ డబుల్ సెంచరీతో కదంతొక్కడంతో, భారత్ ఎనిమిది వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరు సాధించి డిక్లేర్ చేసింది. అనంతరం వెస్టిండీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 243, రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు కట్టడి చేసి, ఇన్నింగ్స్ 92 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది.
న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ 366 బంతుల్లో 211 పరుగులు చేశాడు. భారత్ ఐదు వికెట్లకు 575 పరుగుల స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించి, 3 వికెట్లకు 216 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ప్రత్యర్థి ముందు 475 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని అందుకోవడంలో దారుణంగా విఫలమైన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా 321 పరుగుల భారీ ఆధిక్యంతో విజయభేరి మోగించింది. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ భారత్‌కు కివీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసేందుకు ఉపయోగపడింది.
కివీస్‌తోనే జరిగిన వనే్డ సిరీస్‌లోనూ కోహ్లీ తన బ్యాట్‌కు ఉన్న పదును ఎలాంటితో చూపించాడు. ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 190 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు సాధించి, ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కోహ్లీ 81 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌కు సునాయాస విజయాన్ని అందించాడు.
మొహాలీలో న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డలో కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, భారత్‌ను విజయపథంలో నడిపాడు. న్యూజిలాండ్ 286 పరుగుల లక్ష్యాన్ని ఉంచుతూ విసిరిన సవాలును స్వీకరించిన కోహ్లీ తన బ్యాటింగ్ నైపుణ్యంతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.
తాజాగా ఇంగ్లాండ్‌తో ముగిసిగిన టెస్టు సిరీస్ నాలుగో టెస్టులో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబయిలో జరిగిన ఆ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అతను 515 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 340 బంతులు ఎదుర్కొని, 25 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 235 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జేమ్స్ ఆండర్సన్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయితే, అతని విజృంభణ కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 631 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. అంతకు ముందు కివీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌట్ చేసిన కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 195 పరుగులకే కుప్పకూల్చి, ఇన్నింగ్స్ 36 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. 1932లో ఇంగ్లాండ్‌పై మొట్టమొదటి టెస్టు ఆడిన భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సిరీస్‌ను 4-0 ఆధిక్యంతో సొంతం చేసుకొని, కొత్త చరిత్ర సృష్టించింది. ఈ అసాధారణ విజయంలో కోహ్లీని హీరోగా అంగీకరించి తీరాలి.