క్రీడాభూమి

క్లీన్ అండ్ జెర్క్‌లో జిమ్జాంగ్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కోయిల్ (తమిళనాడు), డిసెంబర్ 27: తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జరుగుతున్న సీనియర్ నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో జిమ్జాంగ్ దేరు సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను మంగళవారం పురుషుల క్లీన్ అండ్ జెర్క్ 62 కిలోల విభాగంలో 153 కిలోల బరువు ఎత్తి ఈ రికార్డును సృష్టించడంతో పాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే మహిళల 58 కిలోల విభాగంలో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు చెందిన సరస్వతి రౌత్, మహిళల 63 కిలోల విభాగంలో పంజాబ్‌కు చెందిన జస్వీర్ కౌర్ స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. అయితే మంగళవారం ఈ పోటీల్లో అందరి కంటే జిమ్జాంగ్ దేరు ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. తొలుత స్నాచ్ విభాగంలో 113 కిలోల బరువు ఎత్తిన అతను ఆ తర్వాత జాతీయ రికార్డును బద్ధలు కొట్టడానికి ముందు క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 153 కిలోల బరువును విజయవంతగా ఎత్తి మొత్తం 266 కిలోలతో పోడియంపై అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ఇంతకుముందు క్లీన్ అండ్ జర్క్ విభాగంలో చండీగఢ్ లిఫ్టర్ రుస్తుం సారంగ్ పేరిట ఉన్న జాతీయ రికార్డు చెరిగిపోయింది. క్లీన్ అండ్ జెర్క్ పురుషుల 62 కిలోల విభాగంలో ఆంథోనీ రాజ్ మొత్తం 261 కిలోల (114+147) బరువు ఎత్తి రజత పతకాన్ని గెలుచుకోగా, 255 కిలోల (112+143) బరువు ఎత్తిన వి.శ్రీనివాసరావుకు కాంస్య పతకం లభించింది.
మహిళల 58 కిలోల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న సరస్వతి మొత్తం 187 కిలోల (81+106) బరువు ఎత్తగా, అమన్‌దీప్ కౌర్ 181 కిలోల (81+100) బరువు ఎత్తి రజత పతకాన్ని, ఎల్.ప్రేమేశ్వరీ దేవి 176 కిలోల (80+96) బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
మహిళల 63 కిలోల విభాగంలో జస్వీర్ కౌర్ మొత్తం 208 కిలోల (94+114) బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలువగా, వందనా గుప్తా 202 కిలోల (87+115) బరువు ఎత్తి రజత పతకాన్ని, సి.స్వాతికృష్ణ నాయర్ 177 కిలోల (79+98) బరువు ఎత్తి కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.