క్రీడాభూమి

కెప్టెన్ కోహ్లీకి అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 27: భారత టెస్టు క్రికెట్ జట్టును అప్రతిహతంగా ముందుకు నడిపిస్తూ సర్వత్రా ప్రశంసలు అందుకొంటున్న డైనమిక్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) మరో విశిష్టమైన గౌరవాన్ని కల్పించింది. ఈ ఏడాదికి తాము ఎంపిక చేసిన అంతర్జాతీయ వనే్డ క్రికెట్ జట్టుకు కోహ్లీని సారథిగా నియమించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. అంతేకాకుండా యార్కర్ స్పెషలిస్టుగా పేరు పొందిన భారత యువ ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా ఈ జట్టులో చోటు కల్పించినట్లు సిఎ వెల్లడించింది. ఈ ఏడాదికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించిన అంతర్జాతీయ వనే్డ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన కోహ్లీ ఇప్పుడు సిఎ ప్రకటించిన ఇంటర్నేషనల్ వనే్డ టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను సైతం పక్కకు నెట్టి సారథిగా ఎంపికవడం విశేషం. అయితే ఈ జట్టుకు స్మిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోయినప్పటికీ ‘ఆల్-స్టార్’ టీమ్‌లో అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా చోటు కల్పించింది.
ఈ ఏడాది పది ఇన్నింగ్స్ ఆడి ఎనిమిది ఇన్నింగ్స్‌లో 45 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన కోహ్లీ జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో వరుస శతకాలతో పరుగుల వరద పారించడంతో పాటు ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 154 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియా మొత్తం స్కోరు (289 పరుగులు)లో సగానికి పైగా పరుగులు సాధించిన విషయం విదితమే. చేజింగ్‌లలో భారత జట్టును 59 సార్లు విజయవంతంగా ముందుకు నడిపిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం 90.10 పరుగుల సగటును కలిగి ఉండటంతో పాటు 20 సందర్భాల్లో అతను భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా గుర్తుచేసింది.
అలాగే భారత యువ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఎంతో నిలకడగా రాణిస్తున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రశంసల జల్లు కురిపించింది. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాదే అరంగేట్రం చేసిన జస్‌ప్రీత్ బుమ్రా ఎంతో నిలకడగా రాణిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. ఈ ఏడాది అతను సాధించిన మొత్తం 17 వికెట్లలో 9 వికెట్లు జింబాబ్వేపై రాబట్టినవే. ప్రత్యర్థులకు తక్కువ పరుగులిచ్చి అతను ఇన్ని వికెట్లు కైవసం చేసుకోవడం మమ్మల్ని ఎంతగానో ముగ్ధులను చేసింది. ఈ ఏడాది మొత్తం మీద ప్రత్యర్థులకు కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే 40 కంటే ఎక్కువ పరుగులిచ్చిన బుమ్రా ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి అసాధారమణమైన రీతిలో 3.63 ఎకానమీ రేటును నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది ప్రపంచంలో ఇంత పొదుపుగా బౌలింగ్ చేసిన అత్యుత్తమ ఆటగాడు బుమ్రాయే. అందుకే ఆస్ట్రేలియా వనే్డ ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో అతనికి చోటు కల్పించాం’ అని సిఎ స్పష్టం చేసింది.
ఈ ఏడాదికి సిఎ ఎంపిక చేసిన
అంతర్జాతీయ వనే్డ జట్టు ఇదీ
విరాట్ కోహ్లీ (్భరత్, కెప్టెన్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), క్వింటోన్ డీకాక్ (దక్షిణాఫ్రికా, వికెట్‌కీపర్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా), జోస్ బట్లర్ (ఇంగ్లాండ్), జస్‌ప్రీత్ బుమ్రా (్భరత్), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా).