క్రీడాభూమి

ఐఓఎ జీవితకాల అధ్యక్షునిగా కల్మాడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 27: ఢిల్లీలో కామనె్వల్త్ క్రీడల సందర్భంగా అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 10 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన పార్లమెంట్ మాజీ సభ్యుడు సురేష్ కల్మాడీ భారత ఒలింపిక్ సంఘ (ఐఓఎ) జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐఓఎ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనతో పాటు మరో కళంకిత నాయకుడు అభయ్ సింగ్ చౌతాలాను కూడా ఐఓఎ జీవితకాల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. వీరిద్దరి కంటే ముందు 2011-12 మధ్య ఐఓఎ తాత్కాలిక అధ్యక్షునిగా పనిచేసిన విజయ్ కుమార్ మల్హోత్రాను మాత్రమే జీవితకాల అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు భారత ఒలింపిక్ సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేసింది.