క్రీడాభూమి

జనవరి ఒకటిన కోహ్లీ, అనుష్క నిశ్చితార్థం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారత స్టార్ క్రికెటర్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిశ్చితార్థం కొత్త సంవత్సరంలో జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని వీరిద్దరూ లేదా వీరి కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. కోహ్లీ, అనుష్క ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో సెలవులను ఆస్వాదిస్తున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులుకూడా వారితోనే ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి ఒకటో తేదీన నిశ్చితార్థం ఉండవచ్చని అనధికార వర్గాలు అంటున్నాయి. లేకపోయినా వచ్చేనెలలో ఖాయంగా నిశ్చితార్థం జరుగుతుందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. 2013 నుంచి కోహ్లీ, అనుష్కల ప్రేమాయణం కొనసాగుతున్నది. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, దీని వల్ల ఇతరులకు వచ్చిన నష్టమేమిటని నిరుడు కోహ్లీ ప్రశ్నించడంతో, అప్పటి వరకూ ఆనోటా ఈనోటా వినిపించిన ప్రేమ వ్యవహారం తెర వెనుక నుంచి తెరపైకి వచ్చింది. కొన్నిసార్లు ఇద్దరూ మాటామాటా అనుకున్నారని, ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారన్న వార్తలు షికార్లు చేశాయి. అయితే, వీరు విడిపోతున్నారన్న వార్తలు వచ్చిన ఒకటిరెండు రోజుల్లోనే వీరు మళ్లీ ఒకటిగా కనిపించడం ఆనవాయితీగా మారింది. ఉత్తరాఖండ్‌లో విహారయాత్రలో ఉన్న కోహ్లీ, అనుష్క నిశ్చితార్థానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, కొంత మంది సినీ, క్రీడా ప్రముఖులు ఇప్పటికే వారికి అందుబాటులో ఉన్నారని సమాచారం. హోటల్ గదులను కూడా బుక్ చేస్తున్నారని తెలుస్తున్నది. ఇరువురి కుటుంబ సభ్యులు సైతం వీరి వెంటే ఉండడం నిశ్చితార్థం వార్తలకు బలాన్నిస్తున్నది.

చిత్రం..అనుష్కతో కోహ్లీ
టీమిండియా ప్రస్థానం