క్రీడాభూమి

ఒహానియన్‌తో సెరెనా నిశ్చితార్థం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 30: రెడిట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌తో నిశ్చితార్థంపై టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ వివరణ ఇచ్చింది. ఒహానియన్ తనకు ప్రపోజ్ చేశాడని, వెంటనే తాను అంగీకారం తెలిపానని ట్వీట్ చేసింది. ఒహానియన్ కూడా నిశ్చితార్థం వార్తను ధ్రువీకరించాడు. అయితే, వివాహం ఎప్పుడు జరుగుతుందనేది వీరిద్దరూ ప్రకటించలేదు. ఇలావుంటే, 33 ఏళ్ల ఒహానియన్ ఇప్పటికే సబ్రియా స్టక్స్‌తో సహజీవనం చేస్తున్నాడు. 35 ఏళ్ల సెరెనాతో పరిచయం ఏర్పడిన తర్వాత కూడా స్టక్స్‌తో తన ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడు. చాలా మంది దీనిని ముక్కోణపు ప్రేమ వ్యవహరంగా అభివర్ణించారు. అయితే, హఠాత్తుగా స్టక్స్‌ను కాదని సెరెనాతో నిశ్చితార్థాన్ని ఒహానియన్ ధ్రువీకరించడం విశేషం.

చిత్రం..ఒహానియన్, సెరెనా