క్రీడాభూమి

లంకతో మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 30: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టును దక్షిణాఫ్రికా 206 పరుగుల భారీ ఆధిక్యంతో సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆతర్వాత లంకను మొదటి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు కట్టడి చేసింది. 81 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, ఆరు వికెట్లకు 406 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంక ముందు 488 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని అందుకునేందుకు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లంక నాలుగో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన శుక్రవారం ఆటను కొనసాగించి 281 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నే (43), కుశాల్ సిల్వ (48) జట్టును ఆదుకోవడానికి కొంత సేపు ప్రయత్నించారు. మిడిల్ ఆర్డర్‌లో కుశాల్ మేండిస్ (58), కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (59) అర్ధ శతకాలు సాధించి, క్రీజ్‌లో నిలదొక్కుకోవడం ద్వారా మ్యాచ్‌ని డ్రాగా ముగించేందుకు ప్రయత్నించారు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ సహకారం లభించకపోవడంతో, లంక ఇన్నింగ్స్ 96.3 ఓవర్లలో 281 పరుగుల వద్ద ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కాగిసో రబదా, కేశవ్ మహారాజ్ చెరి మూడు వికెట్లు కూల్చారు.