క్రీడాభూమి

ఆస్ట్రేలియా టి-20 జట్టు అసిస్టెంట్ కోచ్‌గా గిలెస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, డిసెంబర్ 30: ఆస్ట్రేలియా టి-20 ఇంటర్నేషనల్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ ఎంపికయ్యాడు. శ్రీలంకతో ఫిబ్రవరిలో జరిగే సిరీస్‌కు అతను సేవలు అందిస్తాడు. కోచ్ మరో మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఎంపిక చేసింది. అతనికి సహాయకుడిగా గిలెస్పీ ఉంటాడని ప్రకటించింది. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు డారెన్ లీమన్ కోచ్‌గా, డేవిడ్ సాకెర్ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి స్థానంలో లాంగర్, గిలెస్పీ బాధ్యతలు స్వీకరించడం ఖాయంగా కనిపిస్తున్నది. ముందుగా వీరిద్దరూ శ్రీలంకతో జరిగే టి-20 సిరీస్‌కు సేవలు అందిస్తారు. ఆసీస్, లంక జట్ల మధ్య మూడు టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 17 (మెల్బోర్న్), 19 (గీలాంగ్), 22 (అడెలైడ్ ఓవల్) తేదీల్లో జరుగుతాయి.

చిత్రం..జాసన్ గిలెస్పీ