క్రీడాభూమి

మారిన్‌తో పోటీకి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: తన చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్‌తో పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని, ఆ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు అన్నది. ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) టోర్నీ ఆదివారం నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం కానుండగా, తొలి గేమ్‌లోనే సింధు (చెన్నై స్మాషర్స్), మారిన్ (హైదరాబాద్ హంటర్స్) ఢీ కొంటారు. కాగా, మారిన్‌తో ఆడిన ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని శుక్రవారం పిటిఐతో మాట్లాడుతూ సింధు అన్నది. కొత్త ఏడాది ఉజ్వలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వేదికలపై రాణించి, దేశానికి సాధ్యమైనన్ని ఎక్కువ పతకాలు సాధించి పెట్టడమే తన లక్ష్యమని పేర్కొంది.

చిత్రం.. పివి సింధు