క్రీడాభూమి

రిటైర్మెంట్ యోచనలో మిస్బా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్: పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ రిటైర్మెంట్ యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అతను కూడా ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలపలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు, చివరి రోజున రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్ ఒక్క రోజులోనే పది వికెట్లను కోల్పోయి, అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కోగా, ఈ ఫలితాన్ని ఊహించలేదని మిస్బా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు. ఆస్ట్రేలియాకు సరైన రీతిలో సమాధానం ఇవ్వలేకపోయామని అతను అంగీకరించాడు. ఈ వైఫల్యానికి కారణాలను వెతుక్కోవడం లేదని, పూర్తి బాధ్యత తనదేనని అన్నాడు. ఇలాంటి సందర్భాల్లోనే రిటైర్మెంట్‌పై ఆలోచనలు మొదలవుతాయని వ్యాఖ్యానించాడు. సిరీస్ ముగిసిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇక ఆడలేననిగానీ, జట్టుకు ఉపయోగకరంగా లేననిగానీ అనుకున్న మరుక్షణమే తాను కెరీర్‌కు గుడ్‌బై చెప్తానని స్పష్టం చేశాడు.

చిత్రం..మిస్బా ఉల్ హక్