క్రీడాభూమి

అబ్బే.. అలాంటిదేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: తమ నిశ్చితార్థం జనవరి ఒకటోతేదీన ఉత్తరాఖండ్‌లో జరగనుందంటూ మీడియాలో వచ్చిన వార్తలను భారత స్టార్ క్రికెటర్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని వారు సోషల్ మీడియాలో తేల్చిచెప్పారు. ఎంగేజ్‌మెంట్ ఖాయమైతే, ఆ విషయాన్ని దాచుకోబోమని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో విహారయాత్రలో ఉన్న కోహ్లీ, అనుష్క నిశ్చితార్థం జనవరి ఒకటో తేదీన జరుగుతుందని మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యులుకూడా వారితోనే ఉన్నారని, పలువురు సినీ, క్రీడా ప్రముఖులు నిశ్చితార్థానికి హాజరవుతారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడంటూ కొన్ని ప్రసార మాధ్యమాలు ఊదరగొట్టాయి. అయితే, ఇవన్నీ అర్థంలేని వార్తలేనని కోహ్లీ, అనుష్క పేర్కొన్నారు. ఏదైనా విశేషం ఉంటే, దానిని తామే స్వయంగా ప్రకటిస్తామని తెలిపారు.

చిత్రం..విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ