క్రీడాభూమి

ఐఒఎపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ)పై వేటు పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను జీవితకాల ఉపాధ్యక్షులుగా ఎన్నుకొన్న ఐఒఎ అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ చర్యపై ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వని కారణంగా సస్పెన్షన్‌కు గురైంది. అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ దేశంలో లేడని, అందుకే శుక్రవారం ఐదు గంటల్లోగా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వలేకపోతున్నామని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్న ఐఒఎ తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరింది. అయితే, ఆ వినతిని కేంద్రం తోసిపుచ్చింది. కాలయాపన చేయడానికి ఐఒఎ ప్రయత్నిస్తున్నదే తప్ప నోటీసుకు సమాధానం ఇవ్వాలన్న ఆలోచన ఏమాత్రం కనిపించడం లేదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యానించారు.
కొనితెచ్చుకున్న సమస్య
ప్రస్తుత పరిస్థితిని, సమస్యలను ఐఒఎ కొనితెచ్చుకుంది. పలు ఆరోపణలపై కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కల్మాడీ, అభయ్ చౌతాలాలకు జీవితకాల అధ్యక్ష పదవిని కట్టబెట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా, మొండి వైఖరిని ప్రదర్శించింది. చివరికి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి)ని సంప్రదించిన తర్వాతే తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసుకోవాలన్న ఉద్దేశంతో, షోకాజ్ నోటీకు సమాధానం ఇవ్వడానికి కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని కేంద్రాన్ని ఐఒఎ కోరింది. అయితే, ఈ విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చిందని విజయ్ గోల్ తెలిపారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ కల్మాడీ, చౌతాలా నియామకాలను రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. క్రీడలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అయితే, చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు కూడా నోరు మెదపకుండా కోర్చోడం సరికాదని వ్యాఖ్యానించారు. ఐఒఎ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకూ అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. గుర్తింపును రద్దు చేసిన కారణంగా, జాతీయ ఒలింపిక్ సంఘం హోదాలో ప్రభుత్వ నుంచి పొందుతున్న అన్ని రకాలైన సహాయసహకారాలను ఐఒఎ కోల్పోతుందని స్పష్టం చేశారు. కళంకితులను ప్రతిష్టాత్మక పదవులకు ఎన్నుకోడం ఒలింపిక్ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి వ్యాఖ్యానించారు. జీవితకాల అధ్యక్షులుగా కల్మాడీ, చౌతాలా ఎన్నిక ఏ విధంగానూ సమర్థనీయం కాదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. వారిద్దరికీ పదువులను ఎందుకు కట్టబెట్టారో వివరించాలంటూ పంపిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోగా, కాలయాపన చేసే ఉద్దేశంతోనే ఐఒఎ 15 రోజుల గడువు కోరిందని విమర్శించారు. ప్రభుత్వ అండదండలు, ఆర్థిక సహాయాసహకారాలతోనే ఐఒఎ మనుగడ సాగిస్తున్నదన్న విషయాన్ని గోయల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒలింపిక్ ఉద్యమానికి, క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న ఐఒఎపై చర్య తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు.