క్రీడాభూమి

దేవధర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, జనవరి 27: దేవధర్ క్రికెట్ టోర్నమెం ట్‌లో భారత్ ’ఎ’ ఫైనల్ చేరింది. బుధవారం జరిగి న మ్యాచ్‌లో ఈ జట్టు విజయ్ హజారే ట్రోఫీ చాం పియన్ గుజరాత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిం ది. పార్థీవ్ పటేల్ శతకం వృథాకాగా, గుజరాత్ అ నూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 49.2 ఓవర్లలో 272 ప రుగులు చేసి ఆలౌటైంది. పార్థీవ్ పటేల్ అద్భుత ఇ న్నింగ్స్ ఆడాడు. అతను 125 బంతులు ఎదుర్కొని 16 ఫోర్ల సాయంతో 119 పరుగులు సాధించాడు. అయతే, మిగతా బ్యాట్స్ రాణించలేకపోవడంతో గుజరాత్ భారీ స్కోరు చేయలేకపోయంది. అనం తరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ’ఎ’ 47.2 ఓవర్ల లో నాలుగు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి, ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. కేదా ర్ జాధవ్ 91 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అంబటి రాయుడు 75, ఫయాజ్ ఫజల్ 53 చొప్పు న పరుగులు సాధించి, భారత్ ’ఎ’ను విజయప థంలో నడిపించారు. సునాయాసంగా గెలిచి, ఫైన ల్ చేరిన భారత్ ’ఎ’ తుది పోరులో టైటిల్ కోసం భారత్ ’బి’తో తలపడుతుంది. తుది పోరు ఉత్కం ఠ భరితంగా సాగే అవకాశాలున్నాయ.

స్మిత్‌పై విమర్శల వెల్లువ

మెల్బోర్న్, జనవరి 27: ఆస్ట్రేలియా వనే్డ జట్టు కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌తో మంగళవారం మొదటి టి-20 మ్యాచ్ జరుగుతున్నప్పుడు, 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ క్రీజ్‌లో ఉండగానే చానెల్-9 కామెంటేటర్లతో మాట్లాడడం వివాదానికి కారణమైంది. ఆటగాళ్లకు మైక్రోఫోన్లు ఇచ్చి, మ్యాచ్ జరుగుతున్నప్పుడు వారి అభిప్రాయాలను తెలుసుకునే కొత్త విధానాన్ని మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న చానెల్-9 అనుసరిస్తున్నది. అందులో భాగంగానే స్మిత్ కూడా కామెంటేటర్లతో మాట్లాడి, వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఆ సంభాషణ ముగిసిన వెంటనే అతను రవీంద్ర జడేజా బంతిని అర్థం చేసుకోలేక, మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. కీలకమైన సమయంలో దృష్టిని మళ్లించిన బాతాఖానీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 21 పరుగులు చేసి స్మిత్ వెనుదిరగడంతో, ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. చివరికి మ్యాచ్‌ని 37 పరుగుల తేడాతో చేజార్చుకుంది. కాగా, క్యాచ్ పట్టుకున్న వెంటనే ‘చాటర్ బాక్స్’ను గుర్తుచేసే విధంగా సంకేతాలిచ్చాడు. కోహ్లీ చర్యను ఖండించే వీలుకూడా లేకపోవడంతో అభిమానులు స్మిత్‌పై మరింత గుర్రుగా ఉన్నారు. ఇలావుంటే, మ్యాచ్ మధ్యలో బాతాఖానీపై వస్తున్న విమర్శలను డేవిడ్ వార్నర్ తోసిపుచ్చాడు. ఆటపై దృష్టి పెడితే ఎలాంటి సమస్య ఉండదని వ్యాఖ్యానించాడు.

పాతకాపుల కొత్త యుద్ధం!

దుబాయ్, జనవరి 27: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఎంతో మంది ఆటగాళ్లు సరికొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నారు. అన్ని ఫార్మెట్స్ నుంచి రిటైరైన ఆటగాళ్లు పాల్గొనే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసిఎల్) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. భారత, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెండూల్కర్, షేన్ వార్న్ సంయుక్తంగా ప్రమోట్ చేస్తున్న ఈ టోర్నమెంట్‌లో ఆరు జట్లు పోటీపడతాయి. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) క్రికెట్ బోర్డుతో వీరు పదేళ్లు అమలులో ఉండే కాంట్రాక్టును కుదుర్చుకున్నారు. విర్గో సూపర్‌కింగ్స్, లియో లయన్స్, జెమినీ అరేబియన్స్, శాగటేరియస్ సోల్డ్‌జర్స్, కాప్రికార్న్ కమాండర్స్, లిబ్రా లెజెండ్స్ జట్లు టైటిల్ కోసం యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యాయి. విర్గోలో గ్రేమ్ స్మిత్, బ్రెట్ లీ, జాంటీ రోడ్స్, లియోలో బ్రియాన్ లారా, హెర్చెల్ గిబ్స్, జెమినీలో కుమార సంగక్కర, వీరేందర్ సెవాగ్, ముత్తయ్య మురళీధరన్, శివనారైన్ చందర్‌పాల్, శాగటేరియస్‌లో మహేల జయవర్ధనే, ఆడం గిల్‌క్రిస్ట్, కాప్రికార్న్‌లో ఆండ్రూ సైమండ్స్, సునీల్ జోషి, ఉపుల్ చందన, లిబ్రా జట్టులో సౌరవ్ గంగూలీ, గ్రేమ్ స్వాన్, జాక్వెస్ కాలిస్ వంటి మేటి మాజీ ఆటగాళ్లు ఉన్నారు. తమ అభిమాన క్రికెటర్లను మరోసారి మైదానంలో చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

మెల్బోర్న్, జనవరి 27: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో ఆరోసీడ్ ఏంజెలిక్ కెర్బర్ (పోలాండ్), 47వ ర్యాంక్ క్రీడాకారిణి జొహన్నా కొన్టా (బ్రిటన్) టైటిల్ వేటను కొనసాగిస్తూ సెమీ ఫైనల్స్ చేరారు. గతంలో రెండు పర్యాయాలు (2012, 2013) ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న 16వ సీడ్ విక్టోరియా అజరెన్కా దూకుడుకు కెర్బర్ సమర్థంగా అడ్డుకట్ట వేసింది. 6-3, 7-5 తేడాతో వరుస సెట్లలో ఆమెను ఓడించింది. 2011 యుఎస్ ఓపెన్, 2012 వింబుల్డన్ టోర్నీల్లో సెమీస్ చేసిన కెర్బర్ ఒక గ్రాండ్ శ్లామ్‌లో మూడోసారి ఫైనల్‌లో స్థానం కోసం పోరాడనుంది. క్వార్టర్ ఫైనల్ అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ఆడిన గొప్ప గేమ్స్‌లో ఇదొకటని వ్యాఖ్యానించింది. అజరెన్కాను ఓడించడం సులభం కాదని, ప్రతి పాయింట్‌కూ తాను ఎంతో శ్రమించానని తెలిపింది. అజరెన్కా గొప్పగా ఆడిందని, ఆమెలాంటి ప్రతిభావంతురాలితో తలపడినప్పుడే ఎన్నో పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. అజరెన్కా మాట్లాడుతూ తన ఫుట్‌వరల్క్ సక్రమంగా లేకపోవడం వల్లే పరాజయాన్ని ఎదుర్కొన్నానని అన్నది. కెర్బర్ చక్కటి ఆటతో రాణించిందని ప్రశంసించింది.
మరో క్వార్టర్ ఫైనల్‌లో కొన్టా 6-4, 6-1 ఆధిక్యంతో క్వాలిఫయర్ జాంగ్ షుయ్‌పై సులభంగా గెలిచింది. మొదటి సెట్‌లో కొంత వరకూ ప్రతిఘటిచిన షుయ్ రెండో సెట్‌లో ఆ మాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో ఉన్న కొన్టా చిన్నతనంలో మెల్బోర్న్ టెన్నిస్ కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేసింది. అప్పట్లో ఎండ వేడికి తట్టుకోలేక ప్రాక్టీస్‌ను మధ్యలోనే వదిలి పారిపోయేది. ఇప్పుడు కూడా ఎంత ఆమెను వేధిస్తున్నది. అయితే, 1977 తర్వాత గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో ఫైనల్ చేరిన తొలి బ్రిటిషర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాలన్న పట్టుదలతో ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో షుయ్‌ను ఓడించి, సెమీస్‌లోకి అడుగుపెట్టింది. మరో విజయాన్ని సాధిస్తే ఆమె సుమారు 39 సంవత్సరాల క్రితం నాటి వర్జీనియా వేడ్ రికార్డును సమం చేస్తుంది.
కాగా, శనివార జరిగే సెమీ ఫైనల్‌లో కెర్బర్‌ను కొన్టా ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్, అగ్నీస్కా రద్వాన్‌స్కా తలపడతారు.