క్రీడాభూమి

ప్రొ.బాక్సింగ్‌లోకి జాంగ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: కామనె్వల్త్ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన మహిళా బాక్సర్ పింకీ జాంగ్రా ప్రపంచ మాజీ చాంపియన్ ఎల్.సరితా దేవి మాదిరిగా ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టాలని నిశ్చయించుకుంది. అయితే ఆమె అమెచ్యూర్ కెరీర్‌ను కూడా కొనసాగించాలని భావిస్తోంది. ‘ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి ప్రవేశించాలని నేను నిశ్చయించుకున్నా. శక్తినీ, దేహదారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అయితే అమెచ్యూర్ కెరీర్‌ను మాత్రం ఇప్పుడే వదిలిపెట్టను. వచ్చే ఏడాది ఆసియా క్రీడలతో పాటు కామనె్వల్త్ క్రీడల్లో పాల్గొనాలని నేను కృతనిశ్చయంతో ఉన్నా’ అని జాంగ్రా పిటిఐ వార్తా సంస్థకు వివరించింది. గతంలో జాతీయ చాంపియన్‌గా నిలిచిన జాంగ్రా ఈ మేరకు స్పోర్టీ బాక్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత బాక్సింగ్ మండలి (ఐబిసి) వాణిజ్య విభాగమైన స్పోర్టీ బాక్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మన దేశంలో ప్రొఫెషనల్ బాక్సర్లకు లైసెన్సింగ్ సంస్థగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జాతీయ శిబిరంలో పాల్గొంటున్న పింకీ జాంగ్రా త్వరలో రోహ్తక్‌లోని జాతీయ బాక్సింగ్ అకాడమీలో శిక్షణ పొందనుంది. ఐబిసి తమ మహిళా బాక్సర్ల కోసం ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది.

చిత్రం.. పింకీ జాంగ్రా