క్రీడాభూమి

దక్షిణాఫ్రికా ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, జనవరి 5: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 282 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోగా, జొహానె్నస్‌బర్గ్‌లో ఈనెల 12 నుంచి మొదలుకానున్న చివరిదైన మూడో టెస్టుకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. దక్షిణాఫ్రికా రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగి, మొదటి ఇన్నింగ్స్‌లో 392 పరుగులు సాధించింది. శ్రీలంక ఏ దశలోనూ గట్టి పోటీని ఇవ్వలేక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్లకు 224 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా, ప్రత్యర్థి నిర్దేశించిన 507 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునేందుకు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన శ్రీలంక మ్యాచ్ మూడో రోజు, బుధవారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. గురువారం ఉదయం ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి 224 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టెయిల్ ఎండర్స్‌లో రంగన హెరాత్ అజేయంగా 35 పరుగులు సాధించాడు. వీరిద్దరిని మినహాయిస్తే, మిగతా వారు జట్టును ఆదుకునే దిశగా సరైన కృషి జరపకపోవడంతో శ్రీలంక 224 పరుగులకు ఆలౌటైంది. వరుసగా రెండు టెస్టుల్లో విజయభేరి మోగించిన దక్షిణాఫ్రికా చివరి మ్యాచ్‌ని కూడా గెల్చుకొని, క్లీన్‌స్వీప్ చేసేందుకు సిద్ధమవుతున్నది.

సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 116 ఓవర్లలో 392 ఆలౌట్ (డీన్ ఎల్గార్ 120, క్వింటన్ డి కాక్ 101, లాహిరు కుమార 6/122, సురంగ లక్మల్ 2/103, రంగన హెరాత్ 2/53).
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 43 ఓవర్లలో 110 ఆలౌట్ (ఉపుల్ తరంగ 26 నాటౌట్, దిముత్ కరుణరత్నే 24, వర్నర్ ఫిలాండర్ 4/27, కాగిసో రబదా 4/37, కేశవ్ మహారాజ్ 2/32).
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 51.5 ఓవర్లలో ఏడు వికెట్లకు 224 డిక్లేర్డ్ (డీన్ ఎల్గార్ 55, ఫఫ్ డు ప్లెసిస్ 41, సురంగ లక్మల్ 4/69).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 507/ ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 5 పరుగులు): 62 ఓవర్లలో 224 ఆలౌట్ (ఏంజెలో మాథ్యూస్ 49, రంగన హెరాత్ 35 నాటౌట్, దినేష్ చండీమల్ 30, కౌశల్ సిల్వ 29, కాగిసో రబదా 6/55, వెర్నన్ ఫిలాండర్ 3/48).