క్రీడాభూమి

సాక్షికి సవాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్‌కు శుక్రవారం స్వదేశంలో తొలి సవాలు ఎదురుకానుంది. ప్రో రెజ్లింగ్‌లో సాక్షి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ ఏసర్స్‌కు శుక్రవారం నాటి పోరులో పటిష్టమైన జైపూర్ నింజాస్ నుంచి గట్టిపోటీ తప్పదని విశే్లషకులు సైతం అంటున్నారు. సాక్షితోపాటు ఢిల్లీ ఏసర్స్‌కు రెండు పర్యాయాలు ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న అజర్‌బైజాన్ రెజ్లర్ మరియా స్టాడ్నిక్ కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నది. అభిమానుల అంచనాలకు తగినట్టు రాణించాలన్న ఆలోచన వీరిద్దరిపై ఒత్తిడిని పెంచే ప్రమాదం ఉంది. రియో నుంచి వచ్చిన తర్వాత ఇంత వరకూ సభలు, సన్మానాలతో గడిపిన సాక్షి మొదటిసారి రెజ్లింగ్ మ్యాట్‌పై దర్శనం ఇవ్వనుంది. ఈ పోరులో ఆమె ఎంత వరకూ రాణిస్తుందో చూడాలి.

చిత్రం.. సాక్షి మాలిక్