క్రీడాభూమి

మున్రో సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగునుయ్, జనవరి 6: కొలిన్ మున్రో సెంచరీతో రాణించడంతో, బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌ని 47 పరుగుల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 195 పరుగులు సాధించింది. మున్రో 54 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, మరో ఏడు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. బ్రూస్ 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో రూబెల్ హొస్సేన్ 37 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 18.1 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. సబ్బీర్ రెహ్మాన్ (48), సౌమ్య సర్కార్ (39) తప్ప మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీ 36 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. వీలర్, కేన్ విలియమ్‌సన్ చెరి రెండు వికెట్లు సాధించారు.