క్రీడాభూమి

కడ వరకూ ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుందా? లేదా? ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేయవచ్చా? ఒకవేళ జట్లను ప్రకటిస్తే, అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందా? అన్న ప్రశ్నలు వేధించిన నేపథ్యంలో, చివరి వరకూ ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే, సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరీ తదితరులపై సుప్రీం కోర్టు వేటు వేసిన విషయం తెలిసిందే. దీనితో సెలక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు బిసిసిఐ సంయుక్త కార్యదర్శి రాహుల్ జోహ్రీ నోటీసులు పంపాడు. కానీ, సిఇవోగా ఉన్న ఒక వ్యక్తి సెలక్షన్ కమిటీని పిలిచే అవకాశం ఉందా అన్న ప్రశ్న వినిపించింది. సంస్కరణలను సిఫార్సు చేసిన లోధా కమిటీని సంప్రదించిన తర్వాతే సమావేశాన్ని ఆరంభించాలని నిర్ణయించారు. లోధా ప్యానెల్ సానుకూలంగా స్పందిస్తూ, సెలక్షన్ కమిటీ సమావేశానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రటించడంతో అప్పటి వరకూ నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.