క్రీడాభూమి

సమర్థులకే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వనే్డ, మరో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లకు భారత జట్లలో సమర్థులకే పట్టం కట్టామని భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. యువరాజ్ సింగ్‌ను అతను ప్రత్యేకించి ప్రశంసల్లో ముంచెత్తాడు. మంచి ఫామ్‌లో ఉన్నందుకే అతనిని ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక చేశామని అన్నాడు. రెండు ఫార్మాట్స్‌లోనూ అద్భుతంగా రాణించే శక్తి అతనికి ఉందన్నాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఉండాలన్న ఉద్దేశంతోనే నెహ్రాను తీసుకోవడం జరిగిందన్నాడు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సమావేశానికి ప్రత్యక్షంగా రాలేకపోయాడని చెప్పాడు. అయితే, అతనిని స్కైప్ ద్వారా సంప్రదించి, అభిప్రాయాలు తెలుసుకున్నామని అన్నాడు. సాధ్యమైనంత వరకూ ఉత్తమ జట్టును ఎంపిక చేశామని చెప్పాడు.

చిత్రం..ఎమ్మెస్కే ప్రసాద్