క్రీడాభూమి

యువీకి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: చాలాకాలంగా మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు శ్రమిస్తున్న యువరాజ్ సింగ్‌కు ఊరట లభించింది. అతనిని అటు వనే్డ, ఇటు టి-20 సిరీస్‌కు కూడా తీసుకున్నారు. ఈ రంజీ సీజన్‌లో యువీ కనబరచిన అద్వితీయ ప్రతిభే అతని ఎంపికకు కారణమైంది. ఈసారి రంజీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన అతను 84 సగటుతో 672 పరుగులు చేశాడు. తన ఫామ్‌పై గతంలో వచ్చిన విమర్శలు, అనుమానాలకు అతను బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. జాతీయ జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. యువీ గత ఏడాది జరిగిన టి-20 ప్రపంచ కప్‌లో ఆడిన తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఇన్నాళ్లకు తిరిగి అదృష్టం అతనిని వరించింది.

చిత్రం..యువరాజ్ సింగ్