క్రీడాభూమి

అది మంచి నిర్ణయమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ధోనీ తీసుకున్న నిర్ణయం సరైదేనని, అందులో విచిత్రంగానీ, దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరంగానీ ఏమీ కనిపించడం లేదని భారత మాజీ కెప్టెన్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. 2019లో జరిగే ప్రపంచ కప్‌లో ఆడకూడదని ధోనీ అనుకొని ఉంటే, ఇప్పుడే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడాన్ని మించిన మంచి నిర్ణయం మరొకటి ఉండదని శుక్రవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. రానున్న ప్రపంచ కప్‌లో ఆడకూడదన్న అభిప్రాయం ధోనీలో ఉండవచ్చని, అప్పటిలోగా కెప్టెన్‌గా స్థిరపడేందుకు కోహ్లీకి తగినంత సమయం ఇవ్వాలన్న ఆలోచనతోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి అతను వైదొలగి ఉండవచ్చని ద్రవిడ్ అన్నాడు. తనను తాను ఉత్తమ కెప్టెన్‌గా తీర్చిదిద్దుకోవడానికి కోహ్లీకి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఆటగాడిగా ధోనీ కొనసాగుతాడు కాబట్టి, అతని సహకారం, సూచనలతో ముందుకు వెళ్లాలని కోహ్లీకి హితవు పలికాడు. అయితే, ఆటగాడిగా తాను రాణిస్తానో లేదో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత ధోనీపై ఉందని అన్నాడు. అన్ని ఫార్మాట్స్‌లోనూ ఆటగాడిగా జట్టుకు ఉత్తమ సేవలు అందించగలనన్న నమ్మకం అతనికి ఉంటే మంచిదేనని, ఈ విషయంలో ఇతరులు సలహాలు చెప్పేకంటే, అతనే తనంతట తానే ఒక అభిప్రాయానికి రావడమే మేలని అన్నాడు. కో హ్లీ స్థానంలో ఎవరు కెప్టెన్‌గా ఉన్నా, ధోనీ నుంచి వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఉత్త మ సేవలను ఆశిస్తారని వ్యాఖ్యానించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోనీ ముద్ర ఎప్పటికీ చెదరిపోదని అన్నాడు. అలాంటి ఆడిగాని, కెప్టెన్‌ను అరుదుగా చూస్తామని, భారత క్రికెట్ చరిత్ర పుటల్లో అతనికి సుస్థిర స్థానం ఉంటుందని తెలిపాడు.

మహేంద్ర సింగ్ ధోనీతో ద్రవిడ్ (ఫైల్ ఫొటో)