క్రీడాభూమి

కోహ్లీకి పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు ఫార్మాట్స్‌లోనూ భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. ఇప్పటికే టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతనికి ధోనీ వైదొలగడంతో వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనూ పగ్గాలు లభించాయ. ఈ ఎంపికలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని, ఇంతకంటే మెరుగైన ఎంపిక ఏముంటుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. టెస్టుల్లో జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తున్న కోహ్లీ ఇకపై కెప్టెన్‌గా వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనూ తనదైన ముద్ర వేయడానికి సమాయత్తమవుతున్నాడు.
**
ముంబయి, జనవరి 6: వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో, అతని స్థానాన్ని జాతీయ సెలక్షన్ కమిటీ శుక్రవారం అధికారికంగా విరాట్ కోహ్లీకి అప్పగించింది. ఇప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అతనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్స్ పగ్గాలను కూడా అప్పగించింది. ఇంగ్లాండ్‌తో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేసింది. యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాలకు అనూహ్యంగా మళ్లీ జట్టులో స్థానం లభించింది. యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌కు టి-20 జట్టు చోటు దక్కింది. ఆజింక్య రహానేను టి-20 జట్టులోకి తీసుకోలేదు. ధోనీకి వారసుడిగా ఇప్పటికే ముద్ర పడిన పంత్ ఎంపిక ఆశ్చర్యం కలిగించకపోయినా, యువీతోపాటు వెటరన్ పేసర్ నెహ్రాను తీసుకోవడం పట్ల అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అదే విధంగా రహానేను ఎందుకు వద్దనుకున్నారన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. అయితే, ఈ ఎంపిక సరైనదేనని జాతీయ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సమర్థించుకున్నాడు.
వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్‌గా ధోనీ
కెప్టెన్సీ నుంచి వైదొలగినప్పటికీ, ఆటగాడిగా తాను అందుబాటులో ఉంటానని ధోనీ ప్రకటించడంతో, సెలక్షన్ కమిటీ అతనిని ఇంగ్లాండ్‌తో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు ఎంపిక చేసింది. స్పెషలిస్టు సుమారు తొమ్మిది సంవత్సరాల తర్వాత అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్‌గా దర్శనం ఇవ్వనున్నాడు. ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదని, అతని అవసరం జట్టుకు ఎంత ఉందో కూడా అందరికీ తెలిసిందేనని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే వ్యాఖ్యానించాడు.
యువ పేసర్లు లేరా?
దేశంలో యువ పేసర్లే కరవయ్యారా? అన్న ప్రశ్న వినిపించడానికి జాతీయ సెలక్టర్లు ఆశిష్ నెహ్రాను ఎంపిక చేయడమే ప్రధాన కారణమైంది. ఇటీవలే మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న నెహ్రా పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, సెలక్షన్ కమిటీ ఎవరూ ఊహించని విధంగా నెహ్రాను టి-20 జట్టుకు ఎంపిక చేసింది. ఉమేష్ యాదవ్ స్థానంలో అతనికి చోటు కల్పించింది.
స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, లోకేష్ రాహుల్, మనీష్ పాండే వనే్డ, టి-20 జట్లలో ఉన్నారు. గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధావన్‌కు వనే్డ జట్టులో మాత్రమే చోటు దక్కింది. టి-20 ఫార్మాట్‌లో లోకేష్ రాహుల్‌తోపాటు మన్దీప్ సింగ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశాలు ఉన్నాయి.
ఇంగ్లాండ్‌తో భారత్ మూడు వనే్డలు, మరో మూడు టి-20 మ్యాచ్‌లు ఆడుతుంది.