క్రీడాభూమి

సవాళ్లకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 2014లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు, టెస్టు సిరీస్ జరుగుతుండగానే ధోనీ ఆ ఫార్మాట్ నుంచి వైదొలగుతున్నట్టు హఠాత్తుగా ప్రకటించాడు. దీనితో సెలక్టర్లు కోహ్లీని టెస్టుల్లో కెప్టెన్‌గా నియమించారు. బిసిసిఐ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నాడు. అయితే, ఒక రకంగా ఆ బాధ్యతలే తన ఆటను మెరుగుపరిచాయని వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ విషయంలో ఇప్పుడు తనకు అలాంటి ఇబ్బందులు ఏవీ లేవని కోహ్లీ చెప్పాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో జట్టును ధోనీ నడిపిస్తున్న తీరును చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం తనకు లభించిందన్నాడు. అంతేగాక, చాలా సందర్భాల్లో పలు విషయాల్లో ధోనీ తనను సంప్రదించేవాడని అన్నాడు. ఫీల్డింగ్ పొజిషన్ నుంచి తీసుకుంటే, బౌలింగ్‌లో మార్పులు చేర్పుల వరకూ ఎన్నో అంశాలను ధోనీ చర్చించేవాడని, ఆ రకంగా తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు.
టెస్టుల్లో సులభం..
ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, నాయకత్వ బాధ్యతలు టెస్టుల్లో సులభమని, కానీ, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో చాలా కష్టమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. టెస్టు మ్యాచ్‌ల్లో ఎప్పుడైనా పొరపాటు నిర్ణయాలు తీసుకున్నా, వాటిని సవరించుకోవడానికి తగినంత సమయం ఉంటుందన్నాడు. కానీ, వనే్డ లేదా టి-20ల్లో అలాంటి అవకాశం ఉండదని గుర్తుచేశాడు. మిగతా రెండు ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు ఏమనిపించిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, జీవితంలో ఎన్నడూ మరచిపోలేని అనుభూతిని పొందానని చెప్పాడు. చిన్నప్పుడు క్లబ్ స్థాయిలో ఆడిన రోజుల నుంచి టెస్టు కెప్టెన్‌గా విధులను నిర్వర్తిస్తున్నంత వరకూ ఎన్నో సంఘటనలు, మైలురాళ్లు తన కళ్ల ముందు కదిలాడాయని చెప్పాడు. ఆ క్షణంలో తన మానసిక పరిస్థితిని చెప్పడానికి మాటలు లేవని అన్నాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, ధోనీ నాయకత్వంలోనే తాను ఎదిగానని తెలిపాడు. అతని మార్గదర్శకంలోనే అడుగులు వేశానని చెప్పాడు. ధోనీ ప్రోత్సాహం తనకు జీవితాంతం గుర్తు ఉంటుందని అన్నాడు. భవిష్యత్తులోనూ తాను ధోనీ సలహాలు, సూచనలు తీసుకుంటానని తెలిపాడు.