క్రీడాభూమి

ధోనీకి చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 7: కెప్టెన్సీ నుంచి వైదొలగినప్పటికీ, జట్టులో ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్టర్లు చెక్ పెడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. వృషభ్ పంత్ ఎంపిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని అంటున్నారు. వనే్డల్లో ధోనీ సామర్థ్యంపై నమ్మకం ఉంచిన సెలక్టర్లు టి-20 జట్టులో పంత్‌ను తీసుకోవడం పరోక్షంగా ధోనీకి హెచ్చరికలు జారీ చేయడమేనని అంటున్నారు. పంత్ సమర్థుడైన కీపర్. పరుగుల వరద పారించగల నైపుణ్యం కూడా ఉంది. అతనిని జాతీయ జట్టులోకి తీసుకోవడం అంటే, అన్యాపదేశంగా ధోనీని సాగనంపడమే అన్న అర్థం వస్తుంది. టి-20 ప్రపంచ కప్ 2018లో జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటి నుంచే పంత్‌ను వరల్డ్ కప్ కోసం సిద్ధం చేయాలన్నది సెలక్టర్ల అభిప్రాయంగా కనిపిస్తున్నది. ఈ పరిణామాలను గమనించి ధోనీ త్వరలోనే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా ఆశ్చర్యం లేదు. అసలు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ధోనీ నిర్ణయంచుకోవడానికి కూడా సెలక్టర్ల వైఖరే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ.