క్రీడాభూమి

జతిన్, ఖోడా అవుట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ: భారత క్రికెట్ జాతీయ చీఫ్ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్న జతిన్ పరాంజపే, గగన్ ఖోడాలకు ఉద్వాసన పలకడం ఖా యమైంది. లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో జాతీయ సెలక్టర్లకు కనీస అర్హత కూడా ఉంది. కనీసం రెండు టెస్టుల్లో ఆడిన వారికి మాత్రమే కమిటీ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని లోధా కమిటీ స్పష్టం చేసింది. అయతే, ఈ సిఫార్సును పట్టించుకోకుండా ఐదుగురు సెలక్టర్లను బిసిసిఐ ఎంపిక చేసింది. చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్‌ను ని యమించిన బోర్డు, సభ్యులుగా జతిన్, ఖోడా, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్‌లను నియమించిం ది. వీరిలో మిగతా ముగ్గురూ టెస్టు క్రికెట్ ఆడారు. జతిన్, ఖోడాలకు జాతీయ జట్టులో ఆడే అవకాశం లభించలేదు. కాగా, లోధా సి ఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో వీ రిద్దరూ తమ పదవులను వదులుకోనున్నారు.