క్రీడాభూమి

న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మోన్గానుయ్, జనవరి 8: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం నాటి చివరి మ్యాచ్‌లో ఈ జట్టు 27 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. విజయానికి కివీస్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వ0్ఫలమైన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 167 పరుగులు చేయగలిగింది. కివీస్ బ్యాట్సమన్ కొరీ ఆండర్సన్ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 వర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 57 బంతుల్లో 60 పరుగులు సాధించి కివీస్ ఇన్నింగ్స్‌కు గట్టిపునాది వేశాడు. మిడిల్ ఆర్డర్‌లో ఆండర్సన్ విశ్వరూపం చూపాడు. బంగ్లాదేశ్ బౌలింగ్‌పై విరుచుకుపడిన అతను కేవలం 41 బంతుల్లోనే 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని స్కోరులో రెండు ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌కి ముందే సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన బంగ్లాదేశ్ కంటితుడుపు విజయం కోసం ప్రయత్నించింది. అయితే, సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 42), షకీబ్ అల్ హసన్ (34 బంతుల్లో 41) తప్ప మిగతా వారు వేగంగా పరుగులు రాబట్టడంలో సఫలం కాలేదు. దీనితో ఆ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు చేజార్చుకొని, 167 పరుగులకు చేరుకోగలిగింది. చివరి మ్యాచ్‌ని కూడా కోల్పోయి, వైట్‌వాష్ వేయించుకుంది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 4 వికెట్లకు 194 (కేన్ విలియమ్‌సన్ 60, కొరీ ఆండర్సన్ 94 నాటౌట్, రూబెల్ హొస్సేన్ 3/31).
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 (సౌమ్య సర్కార్ 42, షకీబ్ అల్ హసన్ 41, ట్రెంట్ బఔల్ట్ 2/49, ఇష్ సోధీ 2/22).

చిత్రం..బంగ్లాదేశ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్పీప్ చేసి, టి-20 సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ జట్టు