క్రీడాభూమి

మా ఆవిడకు చెప్పకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 8: సాకర్ కోచ్‌గా మరో పదేళ్లు కెరీర్‌ను కొనసాగిస్తానని చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ మేనేజర్ ఆంటానియో కొనే్ట స్పష్టం చేశాడు. అయితే, ఈ విషయాన్ని తన భార్య ఎలిసాబెతాకు తెలియనివ్వకండి అంటూ పాత్రికేయులతో జోక్ చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్ కోచ్ అలెక్స్ ఫెర్గూసన్, ఆర్సెనల్ ప్రస్తుత కోచ్ ఆర్సెనే వెన్గర్‌లతో తనను తాను పోల్చుకోవడం లేదని జట్టు రొటీన్ వర్కవుట్ పూర్తయిన తర్వాత పాత్రికేయులతో మాట్లాడుతూ అన్నాడు. ‘ఇప్పుడు నా వయసు 47 ఏళ్లు. కనీసం మరో పదేళ్లు కోచ్‌గా సేవలు అందిస్తానన్న నమ్మకం నాకు ఉంది. కానీ, ఈ విషయం నా భార్యకు తెలియకూడదని అనుకుంటున్నాను. మీరూ చెప్పకండి’ అని చమత్కరించాడు. ప్రీమియర్ లీగ్, ఎఫ్‌ఎ కప్ టోర్నీల్లో ఆడుతున్న చెల్సియాకు విజయావకాశాలు ఉన్నాయని అన్నాడు. అన్ని విభాగాల్లోనూ తమ జట్టు బలంగా కనిపిస్తున్నదని, అందుకే, ట్రోఫీలను సాధించే సత్తా తమకు ఉందన్నది వాస్తవమని కొనే్ట వ్యాఖ్యానించాడు. సాధ్యమైనంత ఎక్కువ కాలం కోచ్‌గా కెరీర్‌ను కొనసాగించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నాడు.