క్రీడాభూమి

ప్రపంచ చాంపియన్లను చిత్తుచేసిన మిథాలీ సేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 29: ఆస్ట్రేలియాలో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుతో మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా శనివారం ఎంసిజి (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్)లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో (డక్‌వర్త్/లూరుూస్ పద్ధతిలో) విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కంగారూలపై తొలిసారి సిరీస్‌ను కైవసం చేసుకుంది. వర్షం వల్ల ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవడంతో ఆటను 18 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు బౌలింగ్‌లో చక్కగా రాణించింది. ముఖ్యంగా ఝులన్ గోస్వామి (2/16), రాజేశ్వరీ గైక్వాడ్ (2/27) చక్కగా రాణించి ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఆస్ట్రేలియా జట్టు ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ బెథ్ మూనీ (10), కెప్టెన్ మెగ్ లానింగ్ (49), మిడిలార్డర్ క్రీడాకారిణి జెస్ జొనస్సెన్ (27), అలెక్స్ బ్లాక్‌వెల్ (12-నాటౌట్) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో ఝులన్, గైక్వాడ్‌లతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (1/2), పూనమ్ యాదవ్ (1/17) తమవంతు రాణించారు. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ మిథాలీ రాజ్ (32 బంతుల్లో 6 ఫోర్లు సహా 37 పరుగులు), స్మృతి మందన (24 బంతుల్లో 3 ఫోర్లు సహా 22 పరుగులు) ప్రత్యర్థి బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వీరు చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ 55 బంతుల్లోనే 69 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ తరుణంలో వర్షం వల్ల మరోసారి అంతరాయం ఏర్పడటంతో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో డక్‌వర్త్/లూరుూస్ పద్ధతిని అనుసరించి ఆస్ట్రేలియా (6.94) కంటే మెరుగైన రన్‌రేట్ కలిగివున్న భారత జట్టు (7.52)ను విజేతగా ప్రకటించారు.