క్రీడాభూమి

అన్ని ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, జనవరి 13: క్రికెట్‌లో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉండాలన్న సిద్ధాంతాన్ని తాను అంగీకరించనని, నాయకత్వ విభజనను ఎంతమాత్రం సమర్థించలేనని భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత తొలిసారి అతను శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడాడు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, టెస్టు క్రికెట్ నుంచి వైదొలగిన విషయాన్ని అతను గుర్తుచేస్తూ, అప్పటి నుంచే వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్సీని వదులుకోవాలన్న ఆలోచనలో ఉన్నానని తెలిపాడు. ఈ రెండు విభాగాల్లోనూ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి విరాట్ కోహ్లీ అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడని, అన్ని ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ ఉండాలన్న కారణం గానే తాను వైదొలిగానని ధోనీ స్పష్టం చేశాడు. టెస్టుల్లో జట్టును కోహ్లీ నడిపిస్తున్న తీరు అద్భుతమని కితాబునిచ్చాడు. వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనూ జట్టుకు నాయకత్వం వహించడం ఇప్పుడు కోహ్లీకి చాలా సులభమవుతుందన్నాడు.
ఉజ్వల భవిష్యత్తు
కోహ్లీ నాయకత్వంలో భారత క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ధోనీ జోస్యం చెప్పాడు. తన కంటే ఎక్కువ విజయాలను కోహ్లీ సాధించిపెడతాడని వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో భారత్‌కు ప్రపంచ కప్‌లను అందించిన అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మాట్స్‌కూ ఒకే కెప్టెన్ ఉండడమే శ్రేయస్కరమన్నది తన నమ్మకమని, నాయకత్వ విభజన అనేది భారత్‌లో పనికిరాదని ధోనీ స్పష్టం చేశాడు. ఇప్పుడు అన్ని ఫార్మాట్స్‌లోనూ కోహ్లీనే నాయకత్వం వహిస్తాడు కాబట్టి, భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుందని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా తన కెరీర్ సంతృప్తికరంగా సాగిందని చెప్పాడు. ఒడిదుడుకులు తప్పకపోయినా, మొత్తం మీద తాను విచారించాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదని అన్నాడు.
కోహ్లీకి తన సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని ధోనీ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌ల్లో అవసరాలనుబట్టి తాను కెప్టెన్‌కు సూచనలిస్తానని చెప్పాడు. ఏ జట్టుకైనా వికెట్‌కీపర్ వైస్-కెప్టెన్ లాంటి వాడని, అందుకే, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్‌పై అతనికి ఖచ్చితమైన అవగాహం ఉండాలని చెప్పాడు. కీపర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని అన్నాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, అదే పనిగా ఏదో ఒకటి చెప్పబోనని, అవసరమైనంత వరకే తన పాత్ర పోషిస్తానని వ్యాఖ్యానించాడు. వందలకొద్దీ సూచనలు చేస్తూపోతే, కెప్టెన్‌గా కోహ్లీకి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నాడు. తాను కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు జట్టులో ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారని, వారంతా తనకు సహకరించారని చెప్పాడు. సీనియర్లు వెళ్లిపోతూ ఉంటూ, వారి స్థానాలను యువ ఆటగాళ్లు భర్తీ చేస్తూ వచ్చారని అన్నాడు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతునే ఉంటుందని చెప్పాడు.
ప్రీ మ్యాచ్ సమావేశాలు ఎందుకు?
సిరీస్‌లు లేదా టోర్నీలు జరుగుతున్నప్పుడు, ప్రతి మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల కెప్టెన్లతో ఆనవాయితీగా నిర్వహించే పాత్రికేయుల సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ధోనీ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌కి ముందు సమావేశాల వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించాడు. తన దృష్టిలో ఇలాంటి సమావేశాల వల్ల సమయం వృథాకావడం మినహా లాభమేమీ ఉండదని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశం పెడితే, విశే్లషణలకు వీలుంటుందని సూచించాడు. వ్యక్తిగతంగా తాను ఇలాంటి సమావేశాలకు వ్యతిరేకినని ధోనీ స్పష్టం చేశాడు.

చిత్రం..మహేంద్ర సింగ్ ధోనీ