క్రీడాభూమి

హోరాహోరీగా రంజీ ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జనవరి 13: సుమారు ఆరున్నర దశాబ్దాల తర్వాత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న గుజరాత్ ముందు 312 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన ముంబయి విసిరిన సవాలు ఉత్కంఠ రేపుతున్నది. విజేతను నిర్ధారించే టైటిల్ పోరులో మరొక్క రోజు ఆట మాత్రమే మిగిలివున్న తరుణంలో, ఇరు జట్లు హోరాహోరీ పోరు సాగిస్తున్నాయి. మొదటి ఇన్నింగ్స్‌లో గుజరాత్ కంటే వంద పరుగులు వెనుకంజలో ఉన్న ముంబయి రెండో ఇన్నింగ్స్ ఆడుతూ, మ్యాచ్ మూడో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించి 411 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ 49, ఆదిత్య తారే 69 పరుగులు చేయగా, జట్టును ఆదుకున్న అభిషేక్ నాయర్ 91 పరుగులు సాధించి అవుటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో చింతన్ గజా అద్భుత ప్రతిభ కనబరచి 121 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద పృథ్వీ షా (44), శ్రేయాస్ అయ్యర్ (82), సూర్యకుమార్ యాదవ్ (49), ఆదిత్య తారే (69), అభిషేక్ నాయర్ (91) రాణించడంతో కోలుకున్న ముంబయి తన ప్రత్యర్థి ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.
కాగా, టైటిల్‌పై కనే్నసిన గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, శుక్రవారం నాటి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 47 పరుగులు చేసింది. సమిత్ గొహెల్ (8), ప్రియాంక్ కిరీట్ పాంచల్ (34) క్రీజ్‌లో ఉన్నారు. ఈ జట్టు ఇంకా 265 పరుగులు సాధించాల్సివుంది. పది వికెట్లు పదిలంగా ఉన్న నేపథ్యంలో, ఆదివారం నాటి చివరి రోజు ఆట ప్రాధాన్యతను సంతరించుకుంది. గుజరాత్ బ్యాటింగ్‌పై ముంబయి బౌలింగ్ విభాగం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందా? లేదా? అన్నది ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తుంది.
సంక్షిప్త స్కోర్లు
ముంబయి తొలి ఇన్నింగ్స్: 83.5 ఓవర్లలో 228 ఆలౌట్ (పృథ్వీ షా 77, సూర్యకుమార్ యాదవ్ 57, అభిషేక్ నాయర్ 35, ఆర్పీ సింగ్ 2/48, చింతన్ గజా 2/46, రుజుల్ భట్ 2/5).
గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 104.3 ఓవర్లలో 328 ఆలౌట్ (్భర్గవ్ మెరాయ్ 45, పార్థీవ్ పటేల్ 90, మన్‌ప్రీత్ జునేజా 77, శార్దూల్ ఠాకూర్ 4/84, బల్వీందర్ సంధు 3/63, అభిషేక్ నాయర్ 3/54).
ముంబయి రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 67 ఓవర్లలో 3 వికెట్లకు 208): 137.1 ఓవర్లలో 411 ఆలౌట్ (పృథ్వీ షా 44, శ్రేయాస్ అయ్యర్ 82, సూర్యకుమార్ యాదవ్ 49, ఆదిత్య తారే 69, అభిషేక్ నాయర్ 91, చింతన్ గజా 6/121, ఆర్పీ సింగ్ 2/83).
గుజరాత్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 312): 13.2 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా 47.