క్రీడాభూమి

ఐదో వికెట్‌కు 200 పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, జనవరి 15: కోహ్లీ, జాదవ్ ఐదో వికెట్‌కు 200 పరుగులు జోడించి, వనే్డల్లో ఐదో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని అందించారు. జింబాబ్వేపై జెపి డుమినీ, డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) అజేయంగా 256 పరుగులు పార్ట్‌నర్‌షిప్‌ను అందించి, ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ఇంగ్లాండ్‌కు చెందిన రవి బొపారా, ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్‌పై అజేయంగా 226, భారత క్రికెటర్లు మహమ్మద్ అజరుద్దీన్, అజయ్ జడేజా శ్రీలంకపై 223 చొప్పు భాగస్వామ్యాలను అందించి, వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. మైఖేల్ క్లార్క్, ఆండ్రూ సైమాండ్స్ (ఆస్ట్రేలియా) ఐదో వికెట్‌కు న్యూజిలాండ్‌పై 220 పరుగులు సాధించారు. తాజాగా కోహ్లీ, జాదవ్ ఇంగ్లాండ్‌పై 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
* కేదార్ జాదవ్ 65 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున తక్కువ బంతుల్లో శతకాన్ని సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒకసారి 52, మరోసారి 61 బంతుల్లో శతకాలు నమోదు చేయగా, వీరేందర్ సెవాగ్ 60, యువరాజ్ సింగ్ 64 బంతుల్లో సెంచరీలు చేశారు. వారి తర్వాతి స్థానం జాదవ్‌కు దక్కింది.
* కెరీర్‌లో 27వ వనే్డ సెంచరీని సాధించిన కోహ్లీ, ఛేజింగ్ చేస్తూ ఎక్కువ పర్యాయాలు శతకాలు నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా సచిన్ తెండూల్కర్ సరసన స్థానం సంపాదించాడు. భారత్ లక్ష్య సాధనకు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సచిన్ 17 శతకాలు సాధించాడు. కోహ్లీకి ఈ రకంగా ఇది 17వ సెంచరీ.
* భారత్‌పై ఇంగ్లాండ్ జట్టు అత్యధిక స్కోరును సాధించింది. ఏడు వికెట్లకు 350 పరుగులు ఆ జట్టుకు టీమిండియాపై అత్యధిక స్కోరు. ఇంతకు ముందు, 2011 ఫిబ్రవరిలో, బెంగళూరు వనే్డలో 8 వికెట్లకు 338 పరుగులు సాధించింది. ఆ మ్యాచ్ టైగా ముగిసింది. 1975 జూన్ 7న లార్డ్స్ మైదానంలో 4 వికెట్లకు 334 పరుగులు చేసినప్పుడు ఆ మ్యాచ్‌ని గెల్చుకుంది.

చిత్రం.. కెరీర్‌లో 27వ వనే్డ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ