క్రీడాభూమి

గర్జించిన సెరెనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 17: సుదీర్ఘ కెరీర్‌లో 23వ గ్రాండ్‌శ్లామ్ టైటిల్ సాధించి ఓపెన్ ఎరా టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్న అమెరికా ‘నల్లకలువ’ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్‌లో తన పోరాటాన్ని ఘనంగా ప్రారంభించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆమె ‘జెయింట్ కిల్లర్’గా పేరు పొందిన స్విట్జర్లాండ్ యువ క్రీడాకారిణి బెలిండా బెన్సిక్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ప్రియుడు అలెక్సిస్ ఒహానియన్ సమక్షంలో జరిగిన ఈ పోరులో సెరెనా 6-4, 6-3 వరుస సెట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి సత్తా చాటుకోవడంతో పాటు తన ఫామ్‌పై వ్యక్తమవుతున్న సందేహాలను పటాపంచలు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీ సెమీ ఫైనల్ పోరులో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కోవడంతో పాటు ఈ నెల ఆక్లాండ్ క్లాసిక్ టోర్నీలో మాడిసన్ బ్రింగిల్‌తో జరిగిన పోరులో 88 అనవసర తప్పిదాలకు పాల్పడి రెండో రౌండ్‌లోనే ఓటమిపాలైన సెరెనా విలియమ్స్ ఈ మ్యాచ్‌లో ఎంతో జాగ్రత్తగా ఆడింది. అయినప్పటికీ తొలి సెట్‌లో బెన్సిక్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొన్న సెరెనా విలియమ్స్ రెండో సెట్‌లో తనదైన శైలిలో పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాటు చక్కటి విజయాన్ని అందుకుంది.
అనంతరం సెరెనా మాట్లాడుతూ, ఇప్పటివరకూ తాను ఆడిన క్లిష్టమైన తొలి రౌండ్ మ్యాచ్‌లలో ఇదొకటని వెల్లడించింది. ఈ మ్యాచ్ కంటే ముందు బెన్సిక్ (19)తో రెండుసార్లు తలపడిన సెరెనా విలియమ్స్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించి, మరో మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం తాను ప్రతి మ్యాచ్‌ను, ప్రతి టోర్నమెంట్‌నూ పూర్తిగా వినోదం కోసమే ఆడుతున్నానని, కనుక ఇప్పుడు తాను ఎలా ఆడినా కోల్పోయేది ఏమీ లేదని సెరెనా పేర్కొంది.
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో ఇప్పటికే ఆరుసార్లు టైటిళ్లు సాధించిన సెరెనా విలియమ్స్ ఇప్పుడు మరోసారి విజేతగా నిలిస్తే ఓపెన్ ఎరాలో 22 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లతో జర్మన్ అందాల భామ స్ట్ఫెగ్రాఫ్ నెలకొల్పిన రికార్డును అధిగమించగలుగుతుంది. రెండో రౌండ్‌లో సెరెనా విలియమ్స్ చెక్‌రిపబ్లిక్‌కు చెందిన లూసీ సఫరోవాతో తలపడనుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో హోరాహోరీగా జరిగిన మరో మ్యాచ్‌లో సఫరోవా 3-6, 7-6(9/7), 6-1 తేడాతో యనినా విక్‌మేయర్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. అలాగే యుఎస్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ను ఓడించి వరుసగా 186 వారాల తర్వాత ఆమె నెంబర్ వన్ ర్యాంకుకు గండి కొట్టిన ఐదో సీడ్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా 6-2, 6-0 తేడాతో స్పెయిన్ క్రీడాకారిణి సరా సొరిబెస్ టోర్మోపై, బ్రిటన్‌కు చెందిన జో కోంటా 7-5, 6-2 తేడాతో కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
రెండో రౌండ్‌కు నాదల్
పురుషుల సింగిల్స్‌లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ బోణీ చేశాడు. గాయం కారణగా గత ఏడాది చాలా రోజుల పాటు ఆటకు దూరమైన అతను మంగళవారం ఇక్కడ దాదాపు రెండు గంటల పాటు జరిగిన తొలి రౌండ్ పోరులో 6-3, 6-4, 6-4 సెట్ల తేడాతో జర్మనీకి చెందిన 49వ ర్యాంకు ఆటగాడు ఫ్లోరియాన్ మేయర్‌ను ఓడించాడు. కెరీర్‌లో 14 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన నాదల్ రెండో రౌండ్‌లో సైప్రస్ ఆటగాడు మార్కోస్ బగ్దాటిస్‌తో తలపడనున్నాడు. కాగా, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో ప్రపంచ మూడవ ర్యాంకు ఆటగాడు మిలోస్ రవోనిక్ (కెనడా) 6-3, 6-4, 6-2 తేడాతో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించాడు.

చిత్రాలు..తొలి రౌండ్‌లో మెరిసిన
అమెరికా ‘నల్ల కలువ’

ఫ్లోరియాన్ మేయర్ (జర్మనీ)ను ఓడించిన
‘స్పెయన్ బుల్’ రాఫెల్ నాదల్