క్రీడాభూమి

మూడో రౌండ్‌కు నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: తొమ్మిదో ర్యాంక్ ఆటగాడు, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ చేరాడు. గాయాల కారణంగా చాలాకాలంగా అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్న అతను ఈ ఏడాది ఫిట్నెస్ సమస్యల నుంచి బయటపడుతున్నట్టు కనిపిస్తున్నది. రెండో రౌండ్‌లో అతను ‘జెయింట్ కిల్లర్’ మార్కొస్ బగ్దాటిస్ నుంచి ఎదురైన పోటీని తట్టుకొని, 6-3, 6-1, 6-3 తేడాతోవిజయభేరి మోగించాడు.
పేస్ అవుట్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. బ్రెజిల్‌కు చెందిన ఆండ్రె సాతో కలిసి బరిలోకి దిగిన అతను 6-4, 6-7, 4-6 తేడాతో ట్రీట్ హే, మాక్స్ మిర్నియ్ జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. కాగా, పూరవ్ రాజా, దివిజ్ శరణ్ జోడీ పోరు కూడా మొదటి రౌండ్‌కే పరిమితమైంది. వీరిపై జొనథాన్ ఇసెరిక్, ఫాబ్రిస్ మార్టిన్ 6-7, 6-7 తేడాతో విజయం సాధించారు.

చిత్రం..రాఫెల్ నాదల్