క్రీడాభూమి

చివరి ఓవర్‌లో ఆరు పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్: చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచింది. భువనేశ్వర్ కుమార్ కీలకమైన ఆ ఓవర్‌ను వేయగా, కోహ్లీ బదులు ధోనీ ఫీల్డింగ్‌ను సెట్ చేయడం గమనార్హం. మొదటి బంతిలో డేవిడ్ విల్లే ఒక పరుగు చేయగా, రెండో బంతిలో లాథమ్ ప్లంకెట్ సింగిల్ తీశాడు. మూడో బంతిలో విల్లే రెండు పరుగులు చేశాడు. నాలుగో బంతిలో మరో సింగిల్ వచ్చింది. ఐదో బంతిని రక్షణాత్మకంగా ఆడిన ప్లంకెట్ చివరి బంతిలో ఒక పరుగు చేశాడు. ఆ ఓవర్‌లో ఆరు పరుగులు లభించగా, ఇంగ్లాండ్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
* 2001 నుంచి ఇప్పటి వరకూ ఒక బౌలర్ మొదటి ఐదు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి. 2005లో బులవాయోలో జరిగిన వనే్డలో షేన్ బాండ్ మూడు వికెట్లు సాధిస్తే, ఈ మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ కూడా మొదటి మూడు వికెట్లు కూల్చాడు.
* వనే్డల్లో యువరాజ్ సింగ్ తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఇంతకు ముందు అతను సిడ్నీలో ఆస్ట్రేలియాపై 139 పరుగులు సాధించాడు. ఆ స్కోరును ఈ మ్యాచ్‌లో అధిగమించాడు. కాగా, అతను 2011 తర్వాత వనే్డల్లో శతకాన్ని సాధించడం ఇదే మొదటిసారి. అప్పటి వరల్డ్ కప్‌లో ఆడిన తర్వాత వనే్డల్లో 17 ఇన్నింగ్స్ ఆడిన అతను రెండు అర్ధ శతకాలు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
* నాలుగో వికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ 256 పరుగులు జోడించి, రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించారు. ఈ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం మహమ్మద్ అజరుద్దీన్, అజయ్ జడేజా పేరిట ఉంది. జింబాబ్వేపై వీరు అజేయంగా 275 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో ధోనీ, యువీ 256 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. శ్రీలంకపై 237 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్, ఆండ్రూ సైమండ్స్ ఇప్పుడు మూడో స్థానానికి చేరారు.
* ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. 2008 నవంబర్ 14న రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్లకు 387 పరుగులు చేసింది. ఈసారి ఆరు వికెట్లకు 381 పరుగులు సాధించింది. కాగా, ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన జట్టు న్యూజిలాండ్. 2015 జూన్ 12న ది ఓవల్ మైదానంలో ఆ జట్టు ఐదు వికెట్లకు 398 పరుగులు చేసింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ పరాజయాన్ని చవిచూడడం గమనార్హం.