క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్లిస్కోవాకు లూసిక్ బరోనీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 25: అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన మిర్జానా లూసిక్ బరోనీ 6-4, 3-6, 6-4 తేడాతో కరోలినా ప్లిస్కోవాపై సంచలన విజయాన్ని నమోదు చేసి, సెమీ ఫైనల్ చేరింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ప్లిస్కోవా హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగింది. ఆమెను ఓడించడం లూసిక్ బరోనీకి సాధ్యం కాదని అంతా ఊహించారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆమె విజయభేరి మోగించింది. కాగా, రెండో సీడ్, నిరుటి రన్నరప్ సెరెనా విలియమ్స్ కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో తొమ్మిదో సీడ్ జొహన్నా కొన్టాను 6-2, 6-3 తేడాతో చిత్తుచేసి, టైటిల్ దిశగా ముందడుగు వేసింది.
సెమీ ఫైనల్స్‌కు నాదల్
ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న రాఫెల్ నాదల్ సెమీ ఫైనల్స్ చేరాడు. క్వార్టర్స్‌లో అతను 6-4, 7-6, 6-4 ఆధిక్యంతో మిలోస్ రానిక్‌ను వరుస సెట్లలో ఓడించాడు. మరో మ్యాచ్‌లో గ్రిగర్ దిమిత్రోవ్ తన కంటే నాలుగు స్థానాలు మెరుగైన స్థానంలో ఉన్న 11వ సీడ్ ఆటగాడు డేవిడ్ గోఫిన్‌ను 6-3, 7-6, 6-4 తేడాతో ఓడించి ముందంజ వేశాడు.
బొప్పన్నపై సానియా గెలుపు!
మెల్బోర్న్: సీనియర్ ఆటగాడు రోహన్ బొపన్నపై స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా గెలిచింది. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇవాన్ డోడింగ్‌తో కలిసి ఆడుతున్న సానియా క్వార్టర్ ఫైనల్స్‌లో బొపన్న, గాబ్రియేల డబ్రోవ్‌స్కీ జోడీని 6-4, 3-6, 12-10 తేడాతో విజయం సాధించి సెమీస్ చేరింది.