క్రీడాభూమి

ప్లేయర్ల సంఘంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెటర్ల సంఘంపై ప్రధానంగా దృష్టి సారిస్తాం. అదే విధంగా దేశంలో మహిళా క్రికెట్ పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటాను. బిసిసిఐలో చోటు చేసుకునే మార్పుల్లో నా పాత్ర కూడా ఉంటుందని ఇది వరకే ఊహించాను. కొత్త సవాల్‌ను స్వీకరించి, దానిని విజయవంతం చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. గోపాల సుబ్రహ్మణ్యం నాకు ఫోన్ చేసి, బోర్డు పునర్ నిర్మాణంలో భాగస్వామిగా ఉండేందుకు ఇష్టమేనా అని అడిగారు. మరు క్షణమే సరే అని సమాధానం చెప్పాను. బిసిసిఐలో ఏదో ఒక పాత్ర ఉంటుందని ఊహించాను. అయితే, పాలక మండలిలో సభ్యురాలిగా ఉండే అవకాశం దక్కుతుందని అనుకోలేదు. చాలా పెద్ద బాధ్యతనే సుప్రీం కోర్టు నాకు అప్పగించింది. రైల్వేస్‌లో 40 జట్లను నేను పర్యవేక్షిస్తున్నాను. దీనితో పాలనాపరమైన అనుభవం ఎంతోకొంత ఉంది. అయితే, బిసిసిఐ అనేది చాలా పెద్ద సంఘం. చాలా విస్తారమైన పరిధిలో విధులు నిర్వర్తించాలి. ఇదో సవాలు. భారత క్రికెట్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి కమిటీలోని ప్రతి ఒక్కరం శక్తివంచన లేకుండా కృషి చేస్తాం.
- డయానా ఎడుల్జీ