క్రీడాభూమి

బిసిసిఐ పాలకవర్గ సభ్యుల తొలి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 31: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) పర్యవేక్షణకోసం సుప్రీంకోర్టు సోమవారం నలుగురు ప్రముఖులతో కూడిన పాలక వర్గాన్ని నియమించిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం ఈ కమిటీలోని ముగ్గురు సభ్యులు దక్షిణ ముంబయిలోని బిసిసిఐ ప్రదాన కార్యాలయానికి దూరంగా తొలిసారిగా సమావేశమైనారు. కమిటీలోని భారత మాజీ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, ఐడిఎఫ్‌సి ఎండి విక్రమ్ లిమాయేలు నగర శివార్లలోనిఐడిఎఫ్‌సి బ్యాంక్ భవనంలో సమావేశమైనారు. అయితే నాలుగో సభ్యుడు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ మాత్రం ఈ సమావేశానికి రాలేదు. ‘కమిటీలోని సభ్యులు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం కోసమే ఈ సమావేశం నిర్వహించాం. బిసిసిఐ పని తీరుపైన కొద్దిగా అవగాహనకు వచ్చాం. త్వరలోనే మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణను రూపొందిస్తాం’ అని సమావేశం అనంతరం వినోద్ రాయ్ విలేఖరులతో అన్నారు.
ఇదిలా ఉండగా, బిసిసిఐ వ్యవహారాల నిర్వహణకోసం సుప్రీంకోర్టు నలుగురు సభ్యుల కమిటీని నియమించడాన్ని బిసిసిఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా ప్రశంసిస్తూ, ఫిబ్రవరి 4న జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశంలో బిసిసిఐకి ప్రాతినిధ్యం వహించడంలో ప్రముఖ బ్యాంకర్ అయిన విక్రమ్ లిమాయే చొరవ తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు. బిసిసిఐ కార్యకలాపాల పర్యవేక్షణకు కొత్త పాలక సభ్యుల నియమాకంపై గత వారం రోజులుగా తనకు కంటిమీద కునుకు లేదని బింద్రా అంటూ, అయితే సుప్రీంకోర్టు సోమవారం జరిపిన నియామకాలను చూసిన తర్వాత తనకు ఎంతో ఊరట కలిగిందని అన్నారు. కమిటీలోని సభ్యులంతా కూడా మచ్చలేని నిజాయితీపరులని, అయితే వీరికి స్వార్థపరశక్తులనుంచి అనేక ఒత్తిళ్లు రావచ్చని అభిప్రాయ పడ్డారు. అందువల్ల వీరికి దేశంలోని క్రికెట్ అభిమానులంతా మద్దతుగా నిలవాలని ఆయన తన బ్లాగ్‌లో కోరారు.

చిత్రం..ముంబయిలో సమావేశానికి హాజరైన విక్రమ్ లిమాయే, వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ