క్రీడాభూమి

బడ్జెట్‌లో క్రీడలకు రూ. 1,943 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం ఇది వరకు ప్రకటించిన విధంగానే క్రీడలకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు 1,943 కోట్ల రూపాయలు కేటాయించారు. నిరుడు ఇది 1,592 కోట్ల రూపాయలుకాగా, ఈ ఏడాది 350 కోట్ల రూపాయలు పెంచడం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే కామనె్వల్త్ గేమ్స్, ఆసియా క్రీడల కోసం క్రీడాకారులు సిద్ధమవుతున్న తరుణంలో బడ్జెట్‌లో క్రీడలకు కేటాయింపును పెంచడం గమనార్హం. రియో ఒలింపిక్స్‌లో దారుణంగా విఫలమైన భారత్ కేవలం రెండు (ఒక రజతం, ఒక కాంస్యం) పతకాలతో సరిపుచ్చుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందిస్తూ, క్రీడల అభివృద్ధికి టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారీగా పతకాలు సాధించాలనే ఉద్దేశంతో, ఇప్పటి నుంచే సర్కారు పలు చర్యలు తీసుకుంటున్నది. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) ప్రణాళికా కమిటీకి ఇటీవలే ఏస్ షూటర్ అభినవ్ బింద్రాను చైర్మన్‌గా నియమించింది. పలువురు మాజీ క్రీడాకారులతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తరచు సమావేశమవుతున్నది. ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. దీనికి అనుగుణంగానే క్రీడలకు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తగిన ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో వివిధ జాతీయ శిబిరాలను నిర్వహించే భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)కి ఈ మొత్తంలో 481 కోట్ల రూపాయలు కేటాయించారు. నిరుడు ఈ మొత్తం 416 కోట్లు. జాతీయ క్రీడా సమాఖ్యలకు దినరటర 185 కోట్ల రూపాయలు ఇవ్వగా, ఈ బడ్జెట్‌లో దానిని 302 కోట్ల రూపాయలకు పెంచారు.
ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చే మొత్తాన్ని 131.33 కోట్ల నుంచి 148.4 కోట్ల రూపాయలకు పెంచారు. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో ఎలాంటి మార్పులేదు. ఇంతకు ముందు ఇచ్చిన విధంగానే ఈసారి కూడా 75 కోట్ల రూపాయలే కేటాయించారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్)కు 2016-17 బడ్జెట్‌లో 137.50 కోట్ల రూపాయలను కేటాయించగా, ఈసారి దానిని 6.5 కోట్లు పెంచి, 144 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ‘ఖేలో ఇండియా’కు ఈ బడ్జెట్‌లో 350 కోట్ల రూపాయలు దక్కాయి. నిరుడు ఇది 140 కోట్ల రూపాయలు.